Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ 5లో అందమైన భామలు.. కోటా శ్రీనివాస్ ఏమన్నారంటే?

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (09:34 IST)
బిగ్ బాస్ సీజన్ 5.. స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. మొదటి సీజన్ నుంచి టీఆర్పీని భారీస్థాయిలో తెచ్చిన ఈ షో సీజన్ సీజన్ కు మించిపోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 5 త్వరలోనే మొదలు కానుంది. త్వరలోనే ఫుల్ ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్ధం అయ్యింది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే వారి లిస్ట్ తెరమీదకు రాగా ఇప్పుడు ఈ షోలో గ్లామర్ డోస్ మాములుగా ఉండదని సమాచారం.  వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో మాత్రమే కాకుండా మొదటి నుంచి గ్లామర్ డోస్ భారీగా ఉండనుందని సమాచారం. 
 
ఇక అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ గ్లామర్ భామలు వీళ్ళేనని వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి నుంచి సీరియల్స్ సినిమాలతో అదరగొడుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇలాగే వర్షిణి, సురేఖ వాణిలతో పాటు బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అవ్వనుంది. ప్రేమ కావాలి సినిమాతో మంచి హిట్ అందుకున్న హాట్ హీరోయిన్ ఈషా చావ్లా కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. 
 
బుల్లితెరపై విలన్ పాత్ర పోషిస్తూ మంచి స్థానంలో ఉన్న యూట్యూబర్ అలియాస్ నటి సిరి ప్రియుడితో ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి వస్తుందని వార్తలు రాగా సీజన్ 5లో సింగర్ మంగ్లీ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.  టీవీ9 ప్రత్యూష, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణుప్రియ, వితిక వరుణ్ తేజ్‌లా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. 
 
అయితే బిగ్ బాస్ షోపై విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోటా బిగ్ బాస్ షోపై స్పందిస్తూ.. తాను ఎప్పుడూ ఆ షో చూడనని.. పని లేని వాళ్ళు వంద రోజులు అక్కడ ఉండడానికి వెళ్తారని.. ఇంట్లో పనిలేని వాళ్ళు ఆ షో చూస్తారని అసలు తాను ఆ షో చూడనని అన్నారు.
 
అసలు ఆ షో లో ఏముంటుంది..? అదేమన్నా ప్రపంచానికి పనికి వచ్చేదా..? అంటూ కోటా ప్రశ్నించారు. దాంతో ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక కోటా వ్యాఖ్యలకు కొందరు మద్దతు పలుకుతుంటే.. మరికొందరు మాత్రం భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments