మాస్టర్ సినీ హీరో, తమిళ స్టార్ హీరో విజయ్‌కి షాక్ తగిలింది. విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. అంతే కాకుండా ఆయన వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్ట్.
ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న కారుకు తప్పనిసరిగా టాక్స్ కట్టాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి ఎం సుబ్రహ్మణ్యం తేల్చి చెప్పేశారు. అంతే కాకుండా హీరోలు పన్ను కట్టేందుకు వెనుకాడుతున్నారు అంటూ హై కోర్ట్ సీరియస్ అయింది.
అలాగే పిటిషన్ పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను హీరో విజయ్ కి ఏకంగా లక్ష రూపాయలు జరిమానా విధించింది. విజయ్ కట్టే జరిమానాను కరోనా రిలీఫ్ ఫండ్ కోసం వినియోగించాలని న్యాయమూర్తి తెలిపారు. కాగా గతంలో ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్‌ను హీరో విజయ్ దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే.