నటి అమలాపాల్ పాత్రపరంగా ఎలాంటి వస్త్రధారణ వేయడానికైనా సిద్ధమేనని ఆమధ్య ప్రకటించింది కూడా. ఇప్పుడు తాజాగా `కుడిఎడమైతే` అనే సినిమాలో నటించింది. ఇందులో నటిగా నాలో మరో కోణాన్ని ఆవిష్కరించిన ప్రాజెక్ట్ అని చెబుతోంది. తమిళ సినిమాలు `లూసియా, యూ టర్న్` చూసినప్పుడు దర్శకుడు పవన్‌తో వర్క్‌చేయాలని అనుకున్నాను. ఇప్పుడు నా కల నిజమైంది` అని పేర్కొంది.
బుధవారం రాత్రి అమలాపాల్ `కుడిఎడమైతే సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది. ఈ చిత్రానికి నందినీరెడ్డి దర్శకురాలు. అమలా పాల్ మాట్లాడుతూ, ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఏం చేయాలనే ఆలోచనను మరింతగా పెంచిన ప్రాజెక్ట్ ఇది. బ్రిలియంట్ టీమ్‌తో వర్క్ చేశాను. ముందుగా చెప్పాలంటే నందినీ రెడ్డికి చెప్పాలి.
తనే నాకు ఫోన్ చేసి నేను చేయబోయే దుర్గ అనే పాత్ర గురించి చెప్పింది. మంచి అవకాశాన్ని కల్పించిన నందనీ థాంక్స్. రాహుల్ విజయ్ సహా ఇతర యాక్టర్స్‌కి, టెక్నికల్ టీమ్‌కు థాంక్స్. దుర్గ, ఆది అనే పాత్రల్లో నేను, రాహుల్ చక్కగా క్యారీ చేశాం. రాహుల్ ఓ బ్రదర్‌లా కలిసిపోయాడు. అద్వైత, పూర్ణ చంద్రగారికి థాంక్స్. ఆహా ఈ ప్రాజెక్ట్‌ను పాండమిక్ టైమ్‌లో చేసినా కూడా ఎక్కడా టెన్షన్ లేకుండా చూసుకున్నారు. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి థాంక్స్. జూలై 16న ఆహాలో విడుదల కాబోతున్న కుడి ఎడమైతే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది" అన్నారు