రాజమౌళి దర్శకత్వంలో `రూపొందుతోన్న రౌద్రం రణం రుధిరం`కు సంబంధించిన రామ్‌చరణ్ గ్లిప్స్‌ను విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించినట్లే గురువారంనాడు విడుదల చేశారు. రామోజీ ఫిలింసిటీకి ఆవల వున్న ఓ గ్రామంలో వేసిన సెట్లు, బాహుబలి తరహాలో మాహిష్మతి సామ్రాజ్యం లెక్క అల్లూరి సీతారామరాజు కాలం నాటి ఓ గ్రామం, దానితోపాటు రాజభవనం వంటి సెట్లను రాజమౌళి రెండు నిముషాల వీడియోలో చూపించాడు. ఈసారి ప్రధానంగా రామ్‌చరణ్ పోరాట సన్నివేశాలను చూపించాడు.
గ్రామంలో విదేశీ సిపాయిలు వస్తున్నారని తెలిసి ముందుగా ఊరి జనాలను ఎలా చైతన్యం చేస్తాడో వంటి సన్నివేశాన్ని రాజమౌళి చేసి చూపించారు. అదేవిధంగా సిపాయిలు తుపాకితో గురిచూసి పేలిచే సమయంలో హఠాత్తుగా చెట్టుపైనుంచి దూకి విల్లంభుతో దాడిచేసే అల్లూరి సీతారామరాజు దాడిని కూడా ఆయన చూపించాడు. సిపాయిల తరహాలో తనే తుపాకి గురిపెట్టగా, రామ్‌చరణ్ పైనుంచి దూకుతూ వచ్చి విల్లంబు వేసే సన్నివేశం ఇందులో పొందుపరిచారు. దీనితోపాటు బ్రిటీష్‌రాణి వ్యవస్థ, తన టీమ్‌కు సంబంధించిన కథా చర్చలు ఇందులో వున్నాయి. అయితే త్వరలో మరోసారి ఎన్.టి.ఆర్.కు సంబంధించిన గ్లిప్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదలవుతున్నట్లు వెల్లడించారు.