Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ స్టార్ అజిత్ మాట నిలుపుకున్నాడు.. ఏంటది?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:16 IST)
సాధారణంగా బ్రతికి ఉన్నవారికి ఇచ్చిన మాటని గుర్తుంచుకోవడం, నిలుపుకోవడమే అరుదుగా జరుగుతున్న ఈ రోజుల్లో, అందులోనూ బిజీ షెడ్యూల్‌లతో బిజీ బిజీ జీవితాలను గడిపే సినీ నటులు ఎప్పుడో ఇచ్చిన మాటని గుర్తుంచుకొని ఆ మాటని నిలబెట్టుకోవడం జరిగిందంటే, అది చాలా అరుదనే చెప్పాలి. కానీ అలాంటి ఒక అరుదైన సందర్భం అజిత్ ద్వారా లభించింది.
 
వివరాలలోకి వెళ్తే స్టార్ హీరో అజిత్ కుమార్‌కి దివంగత నటి శ్రీదేవి అంటే చాలా అభిమానమట, అయితే ఆమెకు అజిత్‌తో తన మాతృభాష అయిన తమిళంలో ఓ సినిమా నిర్మించాలని ఉండేదట. ఆ విషయమై అజిత్‌ని సంప్రదించగా తప్పకుండా సినిమా చేస్తానని అప్పట్లో ఆవిడకి మాటిచ్చాడట. అయితే, శ్రీదేవి మరణానంతరం కూడా అజిత్ ఆవిడకి ఇచ్చిన మాటను మరచిపోకుండా శ్రీదేవి భర్త బోనీకపూర్‌ని పిలిచి మరీ అవకాశం ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నాడట.
 
ఈ విషయాన్ని బోనీ స్వయంగా వెల్లడిస్తూ, ‘‘హిందీలో వచ్చిన 'పింక్' సినిమాను తమిళంలోకి రీమేక్ చేస్తున్నాను. ఇందులో విద్యాబాలన్ .. శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. తన మాతృభాష తమిళంలో అజిత్ హీరోగా ఒక సినిమాను నిర్మించాలనే శ్రీదేవి కలని ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ షూటింగ్ సమయంలో ఆవిడ అజిత్‌తో చెప్పగా, తప్పకుండా చేస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకి ఆయన పిలిచి మరీ అవకాశం ఇవ్వడం ద్వారా శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆమె కలను నిజం చేస్తున్నాడు’’ అని తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను లేపేసిన భార్య...

Amaravati: అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు.. నేతన్న భరోసా పథకంపై చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments