Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ స్టంట్‌లో గాయపడిన తమిళ హీరో అజిత్.. హైదరాబాద్‌లో చికిత్స

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (21:06 IST)
తమిళ అగ్రహీరోల్లో ఒకరైన అజిత్ మరోమారు గాయపడ్డారు. తనకు ఇష్టమైన బైక్ స్టంట్ చేస్తూ అదుపుతప్పి బైక్ పడిపోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం అజిత్ వలిమై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. డూప్ లేకుండా బైక్‌తో రిస్కీ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. 
 
ప్రమాదంలో అజిత్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అజిత్ గాయపడ్డారనే వార్తతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అజిత్ గాయపడటంతో షూటింగుకు కొన్ని రోజుల పాటు దూరం కానున్నాడు.
 
కాగా, 'వలిమై' సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్‌కు జోడిగా హ్యూమా ఖురేషి నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments