Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా నటించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ స్పార్క్L.I.F.E

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (13:16 IST)
Vikrant
విక్రాంత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. మెహ‌రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌. విక్రాంత్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌టం విశేషం. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు ‘హృదయం’ ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ విలక్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా న‌టించారు. 
 
రీసెంట్‌గా ‘స్పార్క్L.I.F.E’ షూటింగ్ పూర్త‌య్యింది. ఇప్పుడు మేక‌ర్స్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంలో బిజీగా ఉంది. ఎమోష‌న్స్‌, ల‌వ్‌, భారీ యాక్ష‌న్స్ సీక్వెన్సుల‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో సినిమాటోగ్రాఫ‌ర్ ఎ.ఆర్‌.అశోక్ కుమార్ సినిమాటోగ్ర‌పీ, హేషం అబ్దుల్ వ‌హాబ్ సంగీతం, నేప‌థ్య సంగీతం హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి. 
 
ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీని వ‌రల్డ్ వైడ్‌గా న‌వంబ‌ర్ 17న రిలీజ్ చేయ‌నున్నారు. హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఆడియెన్స్ గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది. విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాజ‌ర్‌, సుహాసిని, మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments