Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు గోదావరి బోటులో అలా కునుకేసిన వేళ.. (వీడియో)

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:28 IST)
'సమ్మోహనం, వి' చిత్రాల తర్వాత మరోసారి సుధీర్ బాబు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో నటిస్తున్నాడు. అదే సమయంలో 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'శ్రీదేవి సోడా సెంటర్'లో నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు మణిశర్మ స్వరాలు అందిస్తుండగా, ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
 
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. దానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను సుధీర్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గోదావరిలోకి మరబోటులు శబ్దం చేసుకుంటూ వెళుతుంటే... అందులో ఓ బోటులో హాయిగా సుధీర్ బాబు కునుకేస్తూ ఉన్నాడు. ఎండ వేడి ముఖం మీద పడకుండా... అసిస్టెంట్ గొడుగు పట్టుకున్నాడు. 
 
అంతే హీరోగారికి... ఆ గోదారి చల్లగాలి తగిలి మంచి కునుకు పట్టేసినట్టుగా ఉంది. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీజీవులకు కరువు అనేది ఏదైనా ఉందంటే అది కంటి నిద్ర మాత్రమే. దానిని ఇలా మరపడవ మీద సుధీర్ బాబు తీర్చుకోవడంలో వింతేం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments