Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు తగ్గాలంటే.. రాత్రి పూట ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...

బరువు తగ్గాలంటే.. రాత్రి పూట ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:22 IST)
చాలా మంది అధికబరువు, ఊబకాయంతో బాధపడుతుంటారు. ఇలాంటి అధిక బరువును తగ్గించుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. దీనికితోడు ఉరుకుల పరుగుల జీవితంలో సమయం సందర్భం లేకుండా ఆకలి తీర్చుకుంటారు. అలా ఆరగించడం వల్ల పలు రోగాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. 

ముఖ్యంగా, ఆ సమయానికి దొరికింది ఒదో ఒకటి తిని.. రోగాలతోపాటు ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే మన జీవక్రియ బరువుపై ఆధారపడి ఉంటుంది. జీవక్రియ సాఫిగా సాగాలంటే.. బరువు తక్కువగా ఉండటం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, రాత్రి సమయాల్లో నూనే పదార్థాలను దూరం చేయాలి. ఎందుకంటే వాటివల్ల ఎక్కువ అనర్థాలు కలుగుతాయి. దీంతోపాటు బరువు కూడా పెరుగుతారు.

రాత్రివేళల్లో చాలామంది ఎక్కువగా తిని నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల బరువు మరింత పెరుగుతారు. అయితే.. బరువు తగ్గాలని అనుకునేవారు రాత్రిపూట మితంగానే ఆహారం తీసుకోవాలి. లేకపోతే అన్నం, రోటి పదార్థాలను దూరం చేసి ఇలాంటి స్నాక్స్ తినాలని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు. 

ముఖ్యంగా, త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం ఉత్తంమ. అలాంటివాటిలో అరటి పండు ఉత్తమం. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి. దీంతో బరువు పెరిగే అవాకశమే లేదు. 

అలాగే, కూరగాయల్లో దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్ లాంటివి తినడం మంచింది. వీటితోపాటు శనగలు లాంటివి తీసుకోవడం ఉత్తమం. శనగలలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతోపాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి.

పెరుగులో పండ్లని కలుపుకుని తింటే చాల మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పెరుగుతోపాటు ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటి పండు లాంటివి కలిపి తింటే ఇంకా మంచిది. దీనివల్ల ఆకలి వేయదని.. దీంతోపాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఠారెత్తిస్తున్న భానుడు : వడదెబ్బకు దూరంగా ఉండాలంటే..