Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్‌పోర్టుకు మహాభారతం పుస్తకంతో అమీర్... జక్కన్నకు ఫోన్?

బాహుబలి చిత్రం చూశాక ఆ చిత్ర దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని అమీర్ ఖాన్ తన మనసులోని మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఐతే అది ఎలాంటి చిత్రమైతే బాగుంటుందన్న విషయంపై చర్చ నడిచింది. చివరికి ఆమధ్య రాజమౌళితో చిట్ చాట్ చేస్తున్నప్పుడు తనకు మహాభారతం చిత్ర

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (17:16 IST)
బాహుబలి చిత్రం చూశాక ఆ చిత్ర దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని అమీర్ ఖాన్ తన మనసులోని మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఐతే అది ఎలాంటి చిత్రమైతే బాగుంటుందన్న విషయంపై చర్చ నడిచింది. చివరికి ఆమధ్య రాజమౌళితో చిట్ చాట్ చేస్తున్నప్పుడు తనకు మహాభారతం చిత్రాన్ని తీయాలని వుందనీ, ఈ చిత్రంలో భారతదేశ చలనచిత్ర హేమాహేమీలను పెట్టి తీయాలనుందని చెప్పారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ కూడా తనకు రాజమౌళి దర్శకత్వంలో చేయాలని వుందని తన ఆసక్తిని వెల్లడించారు. కానీ అది కార్యరూపం దాల్చుతుందో లేదోనన్న అనుమానంతో దాని గురించి పెద్దగా చర్చ జరుగడంలేదు. 
 
తాజాగా ఇప్పుడు అమీర్ ఖాన్ మరోసారి ఈ ప్రాజెక్టుపై చర్చించేట్లు చేశారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ముంబై ఎయిర్‌పోర్టుకి వస్తూ అమీర్ ఖాన్ తన చేతిలో మహాభారతం పుస్తకాన్ని పట్టుకుని వెళుతూ కనిపించడం. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమీర్ ఖాన్ మహాభారతం గ్రంథాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుంటున్నారట. గత కొన్నిరోజులుగా మహాభారతం పుస్తకాన్ని వదలకుండా చదువుతున్నారట. 
 
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కృష్ణుడు లేదా కర్ణుడిగా నటించబోతున్నారు. మరోవైపు దీనిపై అమీర్ ఖాన్ ఈమధ్య రాజమౌళికి కూడా ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. మరి మహాభారతం చిత్రం కార్యరూపం దాల్చితే ఇండియన్ ఇండస్ట్రీలో మరో సంచలనం అవుతుందనడంలో ఎంతమాత్రం అనుమానం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments