మహాభారతంలో శ్రీకృష్ణుడిగా ఎవరు..? అర్జునుడిగా ఎవరు కనిపిస్తారంటే?
''మహాభారతం'' తెరకెక్కించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పిన అమీర్ ఖాన్ ఇందులో అర్జునుడిగా కనిపిస్
''మహాభారతం'' తెరకెక్కించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పిన అమీర్ ఖాన్ ఇందులో అర్జునుడిగా కనిపిస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే తాజాగా మహాభారతంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. సల్మాన్ ఖాన్ కృష్ణుడి పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ద్రౌపది పాత్రలో దీపిక పదుకొణెను ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ రచయితల చేత కథ రాయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మలయాళంలో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో మోహన్‌లాల్ భీముడి పాత్రలో నటిస్తున్నారు. కర్ణుడి పాత్ర కోసం అక్కినేని నాగార్జునను సంప్రదించారు. సుకుమారన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.