Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (18:50 IST)
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ గురువారం నాడు తన 54వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. భార్య కిరణ్ రావ్‌తో కలిసి ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంటిలో కేక్ కట్ చేసాడు. ఈ సందర్భంలో అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు. ఈ ఎన్నికల సంవత్సరంలో దేశ ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు వేయాలని, ఎన్నికలను విజయవంతం చేయాల్సిందిగా కోరాడు. 
 
లోక్‌సభ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైయ్యేలా ఓటర్లను ప్రోత్సహించాలని బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని సెలబ్రిటీలందరికీ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. అమీర్‌ఖాన్ తన బర్త్ డే సందర్భంగా ఓట్లు వేయాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చాడు. అయితే ఎన్నికల్లో మీరు బీజేపీకి మద్దతిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. లేదు అని సమాధానమిచ్చాడు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వను అని ఆమిర్ స్పష్టం చేసాడు. 
 
విదేశాల్లో ఉండే భారతీయులు, ఆనారోగ్యం కారణంగా బ్యాలెట్ బాక్స్ వరకు రాలేని వాళ్ల కోసం ఎన్నికల సంఘం ఏదైనా పరిష్కారం ఆలోచించాలని అమీర్ కోరాడు. తొలిసారి ఓటు వేయబోతున్న ఓటర్లకు కూడా ఆయన ఓ సందేశం ఇచ్చాడు. వాళ్లు ఎవరికి, ఎలా ఓటు వేయాలో చెప్పననీ..తమ నియోజకవర్గంలోని అభ్యర్థి హామీలను నెరవేరుస్తాడా లేదా అన్నది చూసి ఓటేయాలి అని పిలుపునిచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments