Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 10 March 2025
webdunia

ప్రభాస్... నీకు వెయ్యి కోట్లిస్తా... ప్లీజ్ ఆ పాత్రలో నటించవూ: బ్రతిమాలుతున్న అమీర్

ఈమధ్య అమీర్ ఖాన్ ఎటు వెళ్తున్నా చేతిలో మహాభారతం పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. విమాన ప్రయాణంలో సైతం పక్కసీట్లో వున్నవారు మాట కలుపుదామని ప్రయత్నించినా ఏదో కొద్దిగా మాట్లాడేసి మళ్లీ మహాభారతం చదువుతున్నారట. దీనితో ఆయన్ను కదిలించాలంటేనే కాస్త జంకు

Advertiesment
ప్రభాస్... నీకు వెయ్యి కోట్లిస్తా... ప్లీజ్ ఆ పాత్రలో నటించవూ: బ్రతిమాలుతున్న అమీర్
, గురువారం, 30 ఆగస్టు 2018 (18:11 IST)
ఈమధ్య అమీర్ ఖాన్ ఎటు వెళ్తున్నా చేతిలో మహాభారతం పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. విమాన ప్రయాణంలో సైతం పక్కసీట్లో వున్నవారు మాట కలుపుదామని ప్రయత్నించినా ఏదో కొద్దిగా మాట్లాడేసి మళ్లీ మహాభారతం చదువుతున్నారట. దీనితో ఆయన్ను కదిలించాలంటేనే కాస్త జంకుతున్నారట ఆయన సన్నిహితులు. మహాభారత గ్రంధ సారాంశాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకునేందుకు అమీర్ ఖాన్ విశ్వప్రయత్నం చేస్తున్నారట. దీనికి కారణం వుందంటున్నారు.
 
అసలు విషయం ఏంటయా అంటే... అమీర్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాభారత పురాణ ఇతిహాసాన్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఐదు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకుగానీ రిలయన్స్ గ్రూపుతో కూడా మంతనాలు సాగించినట్లు వార్తలు వచ్చాయి. ఇంకోవైపు బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా తను కూడా ఈ ప్రాజెక్టులో కలుస్తానని అంటున్నాడట. దీనితో ఈ చిత్రంపై భారీగా క్రేజ్ పెరిగింది. 
 
మరోవైపు ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కృష్ణుడిగా న‌టిస్తాడ‌ని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమైన ద్రౌపది పాత్రను దీపిక ప‌దుకొణే, దుర్యోధనుడిగా స‌ల్మాన్ ఖాన్, భీష్ముడుగా అమితాబ్ బ‌చ్చ‌న్... ఇలా ఆయా పాత్రలకు స్టార్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ ఏకంగా ప్రభాస్‌కు ఫోన్ చేసి మహాభారతంలో అత్యంత కీలకమైన అర్జునుడి పాత్ర పోషించాలని అభ్యర్థిస్తున్నారట. అవసరమైతే ఈ పాత్రలో నటించినందుకు పారితోషికంగా రూ.1000 కోట్లు ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మరి బాహుబలి చిత్రంతో తన స్టామినా చాటిన ప్రభాస్ ఈ ఆఫర్ అంగీకరిస్తారా లేదా చూడాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేందుకు కనీసం పదేళ్లు పడుతుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చూశావా తెలుగు బిగ్ బాస్‌... మలయాళం బిగ్ బాస్ ఎంత పని చేశాడో?