Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్‌కు నేను వీరాభిమానిగా మారిపోయాను.. హీరోయిన్ దర్శన బానిక్

ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని.. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే కూడా ఇష్టమని.. ఈ ఇద్దరితో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని హీరోయిన్ దర్శన బానిక్

Advertiesment
darshana banik
, సోమవారం, 20 ఆగస్టు 2018 (15:55 IST)
ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని.. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే కూడా ఇష్టమని.. ఈ ఇద్దరితో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని హీరోయిన్ దర్శన బానిక్ అంటోంది. నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రధారులుగా, పరుచూరి మురళి దర్శకత్వంలో 'ఆటగాళ్లు' సినిమా రూపొందింది. ఈ సినిమాలో కథానాయికగా దర్శన బానిక్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. 
 
ఈ నెల 24వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో దర్శన బానిక్ మాట్లాడుతూ.. ఇంతవరకు బెంగాలీ సినిమాలే చేస్తూ వచ్చానని.. ఆటగాళ్లు తొలి తెలుగు సినిమా అని చెప్పింది. ఈ చిత్రంలో జగపతిబాబు, నారా రోహిత్ ఇద్దరూ కూడా పోటీపడి నటించారు.
 
ఈ సినిమాలో తాను హీరోను సిన్సియర్‌గా ప్రేమించే 'అంజలి' పాత్రలో కనిపిస్తాను. తన పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుందని చెప్పింది. తెలుగులో బాహుబలి, ఆర్య, ధ్రువ, అరుంధతి సినిమాలు చూశాను. 'బాహుబలి' సినిమా తరువాత నుంచి తాను ప్రభాస్‌కి వీరాభిమానిగా మారిపోయానని వెల్లడించింది. ఆయన నటన అంటే తనకెంతో ఇష్టమని, ఇక బన్నీ స్టైల్ కూడా తనకు నచ్చుతుందని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోలమావు కోకిలగా నయన.. కరణ్ జోహార్ ప్రశంసల జల్లు