Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది సాయికుమార్ క్రేజీ ఫెలో విడుదల తేదీ ప్ర‌క‌ట‌న‌

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (16:36 IST)
Adi Saikumar, Digangana Suryavanshi,
ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'క్రేజీ ఫెలో. నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది చేతిలో గులాబీ పువ్వుల గుత్తితో నవ్వుతూ కనిపిస్తుండగా, హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ సీతాకోకచిలుక రెక్కలుగా చెరో వైపు కనిపించడం ఎలిగెంట్ గా వుంది.
 
ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.  
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్ర ప్రోమోషన్స్ ను దూకుడుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్.
తారాగణం: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశి,  మర్నా మీనన్
 
సాంకేతిక విభాగం: సమర్పణ:  లక్ష్మీ రాధామోహన్, నిర్మాత : కేకే రాధమోహన్, రచన, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి, సంగీతం : ఆర్ఆర్ ద్రువన్, డీవోపీ: సతీష్ ముత్యాల, ఆర్ట్ : కొలికపోగు రమేష్
ఎడిటర్: సత్య గిడుతూరి, యాక్షన్: రామ కృష్ణ, కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments