Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌న్నీళ్ళు వ‌స్తున్నాయంటున్న కోటీశ్వ‌రుడు

Webdunia
గురువారం, 15 జులై 2021 (16:08 IST)
R. Narayanamurthy
దాస‌రి నారాయ‌ణ‌రావుగారి శిష్యుడిగా న‌టుడిగా చిన్న చిన్న పాత్ర‌లు వేస్తూ, హీరోగా ఎదిగిన న‌టుడు ఆర్. నారాయణమూర్తి. ఒరేయ్ రిక్షాతో ఆయ‌న మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత ఆయ‌నే నిర్మాత‌గా మారి ద‌ర్శ‌కుడు, సంగీతం, కెమెరా, ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ ప‌లు సినిమాలు తీశాడు. ఆయ‌న బాగానే సంపాదించాడు. కోటీశ్వ‌రుడ‌నే చెప్పాలి. అది అంద‌రికీ తెలీని కోణం. కానీ తెలిసిన కోణం ఏమంటే, ఆయ‌న జూబ్లీహిల్స్‌లో ఆటోలో తిరుగుతుంటాడు. న‌డుచుకుంటూ బ‌స్టాప్ వ‌ర‌కు వెళ్ళి బ‌స్ ఎక్కుతాడు. అది ఆయ‌న నైజం. సామాన్యుడిలా వుండాల‌నేది ఆయ‌న మ‌తం కూడా. అలాంటి ఆయ‌న్ను ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్దర్ అన్న మాట‌లు క‌న్నీళ్ళు పెట్టించాయి.
 
ఇటీవ‌లే ఆర్. నారాయణమూర్తి `రైత‌న్య‌` అనే సినిమా రూపొందించాడు. ఆ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగం గ‌ద్ద‌ర్ వ‌చ్చాడు. నారాయణమూర్తి మీద అభిమానంతో మంచి మాట‌లు మాట్లాడాల‌నీ, సినిమా ప్ర‌మోష‌న్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని `ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ` నారాయ‌ణ‌మూర్తి నుద్దేశించి గ‌ద్ద‌ర్ వ్యాఖ్యానించాడు. ఇక సోష‌ల్‌మీడియాలో అది పెద్ద చ‌ర్చ‌గా మారింది. ఎక్క‌డ‌లేని సింఫ‌తీ నారాయ‌ణ‌మూర్తికి వ‌చ్చేసింది. చాలామంది తాము ఆర్థిక సాయం చేస్తామ‌ని పేర్కొన్నారు. అస‌లు సోష‌ల్‌మీడియా అంటే పెద్ద‌గా తెలీని నారాయ‌ణ‌మూర్తికి ఇది పెద్ద షాక్‌. వెంట‌నే వేరే వారి ద్వారా తెలుసుకున్న ఆయ‌న ఈ విధంగా స్పందించారు. 
 
గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన చెందారు. పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నా. నేను క‌ను ఇప్పుడు ఆటోలో తిరిగితే ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి, ఇంటి అద్దె కట్టుకోలేనా! సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చానంటూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments