పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ పదవీ బాధ్యతలను స్వీకరించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయనకు సహచర పోలీసు అధికారులు వేద మంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సాధారణ బదిలీల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పని చేయడానికి అవకాశాన్ని కల్పించిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, డిజిపి గౌతమ్ సావాంగ్‌కు కొత్త ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రాధాన్యత క్రమంలో మహిళా రక్షణపై, మహిళా చట్టాల అమలుకు పనిచేస్తామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ, దర్యాప్తులలో పురోగతిని సాధిస్తామని, సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన రాహుల్ దేవ్ శర్మకు జిల్లా అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జయ రామరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ రామకృష్ణ, ఏలూరు డిఎస్పి డాక్టర్ దిలీప్ కిరణ్, కొవ్వూరు డిఎస్పి బి. శ్రీనాథ్, నరసాపురం డిఎస్పి వీరాంజనేయ రెడ్డి, జంగారెడ్డిగూడెం డిఎస్పి డాక్టర్ రవికిరణ్, పోలవరం డిఎస్పి లత కుమారి, ఏఆర్ డీఎస్పీ కృష్ణంరాజు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి సుబాకర్, శ్రీనివాస రావు, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి కె వి సత్యనారాయణ, సిసిఎస్ డిఎస్పి పైడేశ్వరరావు, ఎస్బి, సిఐ సిహెచ్ కొండలరావు, ఏలూరు వన్ టౌన్ సీఐ, వై.బి.రాజాజీ, ఏలూరు టూ టౌన్ సిఐ ఆది ప్రసాద్ త్రీటౌన్ సీఐ వరప్రసాద్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.