Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 15న సిద్ధంగా ఉండండి... ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్‌డేట్

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (13:27 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మ‌రో అప్ డేట్ వెలువడింది. "రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్" పేరిట ఈ సినిమా మేకింగ్ వీడియోను ఈ నెల 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుద‌ల చేసింది.
 
ఇటీవ‌లే వారి పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి ఆ సినిమా యూనిట్ ఆక‌ర్షించింది. వారిద్దరు ఒకే బైక్‌పై వెళ్తోన్న ఆ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.
 
రెండు పాట‌లు మిన‌హా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని ఇటీవ‌లే సినిమా యూనిట్ వివ‌రించింది. బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments