ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే... ఎవరికైనా ఎప్పుడైనా యాక్సిడెంట్లు సంభవించొచ్చు. దానికి పాన్ ఇండియా క్రియేటివ్ డైరక్టర్ రాజమౌళి హీరోలైనా అతీతులు కాదంటున్నారు... సైబరాబాద్ పోలీసులు. అనడమే కాదు... ఇది తప్పు...ఇది ఒప్పు అని ఏకంగా హీరోలకే ట్రాఫిక్ పాఠాలు నేర్పిస్తున్నారు.
ఇటీవల ఆర్.ఆర్.ఆర్. కొత్త పోస్టర్‌ని దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన వెంటనే... సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఆ సినిమా హీరోలైన జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్‌లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమిస్తున్నారని గుర్తించారు. అంతే... దానిని తామే కరెక్ట్ చేయడానికి ఉపక్రమించారు.
జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్‌లు ఇలా బులెట్ పైన హెల్మెట్లు లేకుండా రాష్‌గా డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే, చూస్తూ ఊరుకుంటామా? అంటూ, వారిద్దరికీ హెల్మెట్లు తొడిగారు. అంతేకాదు... కోవిడ్ నిబంధనలు కూడా ఈ హీరోలు పాటించడం లేదని గుర్తించారు. వారిద్దరికీ మాస్కులు కూడా తొడిగారు.
దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన ఆర్.ఆర్.ఆర్. మూవీ పోస్టర్‌ని కరెక్షన్ చేసి, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో పోస్టర్‌ని విడుదల చేశారు. మరి ఇపుడైనా దర్శకుడు రాజమౌళి తన సినిమా షూటింగ్‌లో కోవిడ్ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారా? లేదా అనేది... ఆర్. ఆర్.ఆర్. రిలీజ్ అయ్యాక... వెండితెరపై చూడాలి.