Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెగ్యులర్ షూటింగ్‌లో `'7 డేస్ 6 నైట్స్`

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (12:37 IST)
MS rajuj on sets
ఎం.ఎస్‌.రాజు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన 'శత్రువు', 'దేవి', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'మస్కా’,‘ఆట’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు చిరునామా. సుమంత్ ఆర్ట్స్ వి జయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు.  దర్శకుడిగానూ గత ఏడాది 'డర్టీ హరిస‌తో  విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్స‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ఇది. ఏబిజి క్రియేషన్స్ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ .ఎం,  రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. సోమవారం హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. 
 
ఈ సినిమాతో పదిహేనేళ్ల కుర్రాడు ‌ సమర్థ్ గొల్లపూడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా కొత్తగ,అల్ట్రామోడ్రన్‌గా ఉండాలనే ఉద్దేశంతో అతడిని తీసుకున్నారు. ప్రస్తుత అగ్ర సంగీత దర్శకులలోఒకరైన దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంఎస్ రాజుగారు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
 
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, జూన్ 21న జూలై 10 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్ నికోబార్ దీవుల్లో నెలరోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేశాం. సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాం. `డర్టీ హరి' తర్వాత దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారుశ్రీకారం చుట్టారు. సాంకేతిక పరంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో  తెరకెక్కుతోంది" అని అన్నారు. 
 
ఎం.రాజు మాట్లాడుతూ, ఇందులో నటీనటుల వివరాల్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాం. తర్వాత వాళ్లు ఎవరనేది వెల్లడిస్తాం. కథ పరంగా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాలి. అందుకు తగ్గట్టు పక్కా ప్రణాళిక వేసుకుని, చిత్రీకరణ మొదలుపెట్టాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. 'డర్టీహరి'తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. నిర్మాతగా, దర్శకుడిగా నేనెప్పుడూ ఒకదానికి, మరొకదానికి పొంతన లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాను. 'డర్టీ హరి' ఓ జానర్ సినిమా.‌ '7 డేస్ 6 నైట్స్' కూల్ ఎంటర్టైనర్. ఇందులో వినోదానికి మంచి అవకాశం ఉంది. లవ్, ఎమోషన్స్ ‌కి చక్కటి ఆస్కారం ఉంది. సంగీతానికి సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంది. పాటలు కొత్తగా ఉంటాయి" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

గోవాలో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపేసారు, ఎందుకు?

కుంభమేళా అంటే ఏమిటి? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే ఎందుకు జరుగుతుంది

మున్సిపల్ యాక్ట్ రద్దు.. అమరావతిలో ఇంజనీరింగ్ కాలేజీలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments