Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డర్టీ హరి ఎందుకలా అయ్యాడు, ఇద్దరు మహిళలతో... రివ్యూ

Advertiesment
డర్టీ హరి ఎందుకలా అయ్యాడు, ఇద్దరు మహిళలతో... రివ్యూ
, శనివారం, 19 డిశెంబరు 2020 (15:44 IST)
ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు దర్శకుడిగా మారి తీసిన చిత్రం డర్టీ హరి. ఈ చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను ఏంటో చూపే ప్రయత్నం చేసాడు రాజు. డర్టీ హరి పాత్రల గురించి చూస్తే.. హరి (శ్రావణ్) చరిష్మా వున్న యువకుడు.
 
చదరంగంలో ప్రావీణ్యుడు. వైదేహి (రుహానీ), ధనవంతురాలైన అమ్మాయి. అతడితో ప్రేమలో పడుతుంది. వెంటనే పెళ్లి కూడా చేసేసుకుంటారు. ఇలావుండగా హరికి జాస్మిన్ (సిమ్రాట్) అనే వర్థమాన నటి పట్ల ఆకర్షితుడవుతాడు. ఆమెతో వివాహేతర సంబంధం సాగిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఐతే వైదేహి నుంచి విడాకులు తీసుకోవాలని హరిని జాస్మిన్ కోరుతుంది. అలా చేస్తేనే పెళ్లి చేసుకుంటానంటుంది.
 
శ్రావణ్ రెడ్డి హరి పాత్రకు తగినట్లుగా నటించి ఆకట్టుకున్నాడు. రుహానీ శర్మ తన భర్తను పిచ్చిగా ప్రేమించే భార్యగానూ, తల్లి కావడమే లక్ష్యంగా వుంటుంది. సిమ్రాట్ కౌర్ గ్లామర్ పాత్ర పోషించింది. స్కిన్ షో, బోల్డ్ సీన్స్ చేయడంపై ఆమెకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ ప్రేక్షకులను సంతృప్తి పరచడానికి అవసరమైన గ్లామర్ డోస్ అందించింది.
webdunia
డర్టీ హరి ఎలా వున్నాడంటే?
డర్టీ హరి శృంగార థ్రిల్లర్ అంతగా ఆకట్టుకున్నట్లు లేదేమోననిపిస్తుంది. చిత్రం ద్వితీయార్థం హత్య రహస్యంపై దృష్టి సారించినట్లయితే డర్టీ హరి ఆకర్షణీయమైన చిత్రం అయి వుండేది. కానీ ఎం.ఎస్ రాజు ఎక్కువగా కామం, ప్రేమలపై ఫోకస్ చేయడంతో చిత్రం గందరగోళంగా వున్నట్లనిపిస్తుంది. డర్టీ హరి ప్రారంభంలో కాస్త ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి చకచకా అయిపోయాక, హరి- జాస్మిన్ ఒకరినొకరు ఎలా ఆకర్షించుకుంటారు? అక్రమ వ్యవహారాన్ని ఎలా ప్రారంభిస్తారు? అనే దానిపై సాగతీత మొదలవుతుంది.
 
రుహానీ పాత్ర ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నట్లనిపిస్తుంది. ఫలితంగా డర్టీ హరి ఆకట్టుకునే థ్రిల్లర్‌గా కాకుండా పోయినట్లయింది. అలాగే, జాస్మిన్ పాత్ర కలలు కన్న మహిళగా చూపించాడు. ఆమె గర్భవతి అయిన తర్వాత చాలా మూస ధోరణిలో ప్రవర్తిస్తుంది. అజయ్ పాత్ర పరిచయం చేయబడినప్పుడు విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. కానీ ఇది ఒక సన్నివేశానికి పరిమితం చేయబడింది. కథ గబుక్కున ఎండ్ పాయింట్‌కు చేరుకుంటుంది. హరి పనులకు, జాస్మిన్ దురదృష్టాలకు సరైన సమర్థన లేకుండా ప్రతిదీ అనుకూలమైన మార్గంలో ముగుస్తుంది. డర్టీ హరి అని పేరులో వున్నప్పటికీ అంతగా చిత్రం మాత్రం అత డర్టీగా ఏమీ లేదని చూస్తే తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్‌కి బద్ధకం ఎక్కువ.. పెళ్లి అంటేనే పారిపోతాడు.. రాజమౌళి