ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డిని తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ సస్పెన్స్‌తో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం 'డర్టీ హరి'. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ATT యాప్ పైన ఈ చిత్రం విడుదల కానుంది.
ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రత్ కౌర్, రుహాని శర్మలు ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా ఫ్రైడే మూవీస్ యాప్ తరపున అనురాగ్ పర్వతనేని, విజయ్ మద్దూరి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
విజయ్ మద్దూరి, అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ... కరోనా ప్యాండమిక్ వలన అందరూ ఇళ్ళకు పరిమితమైయ్యారు. ఇప్పడిప్పుడే కొంతవరకూ పరిస్థితులు మారుతున్నాయి. జన సంచారం వున్న ప్రదేశాలకు వెళ్ళాలంటే ఇంకా మనసులో భయం మాత్రం తగ్గటం లేదు. ఈ తరుణంలో అందరికి అందుబాటులో వుండేలా ఒక ఏటిటి సిద్దమైంది. మీ ఇంటికే వచ్చి మంచి సినిమాల్ని మీ ఇంట్లో మీకు సర్వ్ చేయబోతుంది.
ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఏ సినిమా విడుదలవుతుందో పేపర్స్‌లో చూసుకుని టికెట్స్ బుక్ చేసుకుని ట్రాఫిక్‌లో థియేటర్‌కి వెళ్ళి పార్కింగ్ చేసుకునే లోపు సినిమా స్టార్టవుతుందేమోననే కంగారు ఇక నుండి లేకుండా ఇక నుండి ఫ్రైడే మూవీస్ మీ ముందుకు వస్తుంది. దీనికోసం మీరేమి చెయ్యాలంటే 7997666666 నెంబర్‌కి సింగిల్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ మొబైల్లో ఫ్రైడే మూవీస్ యాప్ చేరుతుంది. మీ ఆనందాన్ని మీ మొబైల్లో వుంచుతుంది. అలానే ఈ యాప్ ద్వారా డర్టీ హరి సినిమా చూడాలనుకునే వారు 120 రూపాయలు టిక్కెట్ ధర చెల్లించవలసి ఉంటుంది. ప్రతి వారం కొత్త సినిమాలతో పాటు సర్‌ప్రైజ్ చేసే మరికొన్ని అంశాలుంటాయని తెలిపారు.