Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థియేటర్లలో 'బొమ్మ' పడాలంటే... ఇవి పాటించాల్సిందే..

థియేటర్లలో 'బొమ్మ' పడాలంటే... ఇవి పాటించాల్సిందే..
, బుధవారం, 7 అక్టోబరు 2020 (09:13 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా, సినిమా థియేటర్లు మూతపడివున్నాయి. మార్చి నెలలో ప్రకటించిన లాక్డౌన్ మొదలు ఇప్పటివరకు సినిమా హాళ్లు మూసేవున్నాయి. లాక్డౌన్ సడలింపులను దశలవారీగా ప్రకటిస్తూ వచ్చిన కేంద్రం ఇటీవలే సినిమా ప్రదర్శనలకు పచ్చజెండా ఊపింది. అక్టోబరు 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రకటించింది. అయితే, ఇప్పటికీ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉండటంతో థియేటర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
 
థియేటర్ల యజమానులు పాటించాల్సిన నియమాలు.. 
* సినిమా హాలు సీటింగ్ కెపాసిటీలో సగం కంటే తక్కువ అంటే 50 శాతం కంటే తక్కువ సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలి.
* సీట్ల ఏర్పాటులో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. భౌతికదూరం విధానంలో సంబంధిత సీట్లపై 'ఇక్కడ కూర్చోవద్దు' అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
* సినిమా హాల్లోకి ప్రేక్షకులు ప్రవేశించే ముందు థర్మల్ స్కానర్‌తో వారిని పరీక్షించాలి.
* శానిటైజర్, హ్యాండ్ వాష్‌లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
* ఒకే కాంప్లెక్స్‌లో అంటే మల్టీప్లెక్స్, మాల్స్‌లలో పలు స్క్రీన్లు ఉంటే వాటిలో సినిమా ప్రదర్శనల వేళల్లో మార్పులు చేయాల్సి. 
* సినిమా హాలు సిబ్బందికి పీపీఈ కిట్లు, గ్లోవ్స్, బూట్లు, మాస్కులు తప్పనిసరిగా ఇవ్వాలి. సిబ్బంది భద్రత కోసం కూడా శానిటైజేషన్ చేస్తుండాలి.
* సినిమా హాలు లోపల ఉష్ణోగ్రత 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూడాలి. ఏసీని బంద్ చేయాలి. 
* టికెట్లు విక్రయించే కౌంటర్‌లో తరచుగా క్రిమిసంహారకాలతో శుభ్రపరచాలి. ఈ కౌంటర్లను రోజంతా తెరిచే ఉంచాలి. ప్రేక్షకుల రద్దీని నివారించడం కోసం ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
* అడ్వాన్స్ బుకింగ్ విధానం అమలు చేయాలి. ఆన్‌లైన్, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలి.
 
అలాగే, ప్రేక్షకులు పాటించాల్సిన మార్గదర్శకాలు... 
* కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు థియేటర్లకు రాకూడదు. వైరస్‌లేని వ్యక్తులే సినిమా హాళ్లలో ప్రవేశించాలి.
* ఒకవేళ లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే స్వయంగా తమ పరిస్థితిని హాలు సిబ్బందికి తెలియజేయాలి.
* సినిమా థియేటర్ ప్రాంగణంలో ఉమ్మివేయడం పూర్తిగా నిషేధం
*  విరామ సమయంలో ప్రేక్షకులు బయట తిరగరాదు.
* కరోనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.
* సినిమా ప్రారంభంలోనూ, విరామం సమయంలోనూ, చివరిలో కరోనాపై ప్రకటనలను ప్రదర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎందుకు ఆలోచిస్తున్నావు? నేరుగా నా నోట్లో పెట్టు: బిగ్ బాస్ హౌసులో కొత్త ప్రేమజంట