Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ భద్రతా ఉద్యోగికి రెండోసారి కరోనా.. శ్రీనివాసం కోవిడ్ సెంటర్‌కు తరలింపు..

Advertiesment
టీటీడీ భద్రతా ఉద్యోగికి రెండోసారి కరోనా.. శ్రీనివాసం  కోవిడ్ సెంటర్‌కు తరలింపు..
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (18:52 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతా ఉద్యోగికి రెండోసారి కరోనా సోకింది. శ్రీవారి ఆలయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగికి జూన్ 27న కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయనకు అప్పుడు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత నెగెటివ్‌ రావడంతో విధులకు హాజరయ్యాడు.
 
కొద్ది రోజులుగా శ్రీవారి ఆలయంలో డ్యూటీ కూడా చేస్తున్నాడు. అయితే ఈయన తాజాగా జ్వరం రావడంతో టెస్ట్ చేయించున్నాడు. దీంతో అతనికి మళ్లీ పాజిటివ్ తేలింది. వెంటనే ఈయన్ని శ్రీనివాసం కోవిడ్ సెంటర్‌కు తరలించారు. ఏపీలో ఇది కరోనా రీ ఇన్ఫెక్షన్ కేసు కావడంతో ఆయనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశం కనిపిస్తోంది.
 
ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుండి జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
 
ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ముంబయిలో దేవాలయం నిర్మాణానికి తర్వలో శ్రీకారం చుడుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వారణాసిలో వేంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వాన్ని స్థలం కేటాయించాలని కోరినట్లు అధికారులు వివరించారు. జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఆలయ నిర్మాణం చేపడుతామని ఆయన తెలిపారు.
 
వైజాగ్ లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు టీటీడీ ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత అక్కడ మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. రూ.4.95 కోట్లతో వైజాగ్ శ్రీవారి ఆలయంకు ఘాట్ రోడ్ల నిర్మాణంకు చేపట్టబోతున్నామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలి... కోర్టుకెక్కిన యువకుడు