Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ్వరం ఉంటే నో ఎంట్రీ... హైదరాబాద్ మెట్రో జర్నీకి గైడ్‌లైన్స్..

జ్వరం ఉంటే నో ఎంట్రీ... హైదరాబాద్ మెట్రో జర్నీకి గైడ్‌లైన్స్..
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (13:24 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆగిపోయిన మెట్రో రైళ్ళ రాకపోకలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ రైలు సేవల పునరుద్ధణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే, మెట్రో రైళ్ళలో ప్రయాణించేందుకు పలు ఆంక్షలతో పాటు.. మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సోమవారం నుంచి మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రతి 5 నిమిషాలకో రైలు అందుబాటులో ఉండనుంది. 3 దశలలో మూడు కారిడార్‌లలో రైళ్లను పునరుద్ధరించనున్నారు. 
 
థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన తరువాతే ప్రయాణికులను స్టేషన్లలోకి అనుమతించనున్నారు. జ్వరం ఉన్నట్టు తేలితే మెట్రో స్టేషన్‌లోకి అనుమతించరు. ముఖ్యంగా, కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే మెట్రో స్టేషన్లు మూసివేసి వేయనున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా గాంధీ దావఖాన, భరత్‌నగర్‌, మూసాపేట, ముషీరాబాద్‌, యూసుఫ్‌గూడ స్టేషన్లలో రైలు ఆగవు. స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై సీసీ కెమెరా నిఘా ఉంటుంది. 
 
* ఈ నెల 7వ తేదీన మియాపూర్‌ - ఎల్బీనగర్‌ కారిడార్‌లో రైళ్లు ప్రారంభమవుతాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే ఈ రైలు సర్వీసులను నడుపుతారు. 
* 8వ తేదీన నాగోలు నుంచి రాయదుర్ంగ వరకు రైళ్ల రాకపోకలు సాగుతాయి. 
* 9న ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ స్టేషన్‌ వరకు సేవలు ప్రారంభమవుతాయి. ఆ రోజు నుంచి మొత్తం మూడు ఫేజ్‌లలో రైళ్లు నడుస్తాయి. 
* ప్రతి 5 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. 
 
మెట్రో జర్నీకి నిబంధనలు ఇవే..!
* మాస్క్‌, భౌతిక దూరం తప్పనిసరి. 
* స్టేషన్లలో సూచించిన నిబంధనలను విధిగా పాటించాల్సిందే. 
* రైలులో రెడ్‌ మార్కింగ్‌ చేసి ఉన్న సీట్లలో కూర్చోకూడదు.
* స్టేషన్‌ లోపల భౌతికదూరం పాటించేలా ఉన్న మార్కింగ్స్‌లోనే నిల్చోవాలి. 
 
* మెట్రో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఉంటారు. 
* అన్ని స్టేషన్లలో మాస్కులను కూడా విక్రయించనున్నారు. 
* రైళ్ల రాకపోకలు లేని సమయంలో స్టేషన్లలో శానిటైజేషన్ చేపడుతారు. 
* లిఫ్ట్‌ బటన్స్‌, ఎస్క్‌లేటర్‌ హ్యాండ్‌ రెయిల్స్‌ 4 గంటలకోసారి శానిటైజ్‌ చేస్తారు. 
* స్మార్ట్‌కార్డు, మొబైల్‌ క్యూఆర్‌ టికెటింగ్‌, క్యాష్‌లెస్‌ ప్రయాణం మాత్రమే అనుమతి.
 
* సీసీ కెమెరాలు ఉంటాయి. నిబంధనలను అతిక్రమిస్తే జరిమానా తప్పదు. 
* అన్ని స్టేషన్ల ప్రవేశ మార్గాలు, నిష్క్రమణల వద్ద పెడల్‌ శానిటైజర్లు ఉంటాయి. 
* ప్రవేశ మార్గం వద్దే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. ఏవైనా స్వల్ప లక్షణాలు ఉంటే వెనక్కి పంపిస్తారు. 
* రైళ్లలో ఏసీ సరఫరా ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా గాలి బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అపుడే పుట్టిన కవల ఆడపిల్లలకు విషం తాపించిన తండ్రి.. ఎక్కడ?