Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

7 నుంచి మెట్రో రైల్ సేవలు.. తెలుసుకోవాల్సిన అంశాలివే....

Advertiesment
7 నుంచి మెట్రో రైల్ సేవలు.. తెలుసుకోవాల్సిన అంశాలివే....
, బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:09 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత అంటే సుమారు ఐదు నెలల తర్వాత మెట్రో రైల్ సేవలు ప్రారంభంకానున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకిరానున్నాయి. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 7వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పునఃప్రారంభంకానున్నాయి. ఈ నెల 12 నుంచి అన్ని కారిడార్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో, మెట్రో రైలు సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.
 
 
* కంటైన్మెంట్ జోన్లలో ఉండే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసే ఉంచుతారు.
* థర్మల్ స్క్రీనింగ్ తర్వాత కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే మెట్రో రైల్వే స్టేషన్‌లోకే అనుమతిస్తారు. 
* సామాజికదూరాన్ని పాటించే నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైళ్లు కొన్ని స్టేషన్లలో ఆగకుండానే వెళ్లిపోతాయి.
 
* అతి తక్కువ లగేజీని మాత్రమే అనుమతిస్తారు. మెటల్ ఐటెమ్స్‌ని అనుమతించరు.
* సామాజికదూరాన్ని పాటించే క్రమంలో స్టేషన్లతో పాటు, రైలు బోగీల్లో కూడా మార్కింగ్ వేస్తారు.
* ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. 
 
* స్టేషన్ ఎంట్రన్స్‌లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. తరచుగా స్టేషన్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి.
* స్మార్ట్ కార్డ్, ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యతను ఇవ్వాలి. టోకెన్లు, టికెట్లను కూడా సరైన రీతిలో శానిటైజ్ చేసి వినియోగించాలి. 

* మాస్కులు లేకుండా వచ్చే ప్రయాణికులు వాటిని స్టేషన్లలో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలి.
* మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసిపెట్టుకుని, ఖచ్చితంగా వినియోగించాలని సూచన చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ విడుదల.. ఫీచర్లు ఏంటంటే?