"ఆచార్య'' లాహె..లాహె... అదుర్స్ రికార్డ్.. 35 మిలియన్ల వ్యూస్‌

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:42 IST)
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌ కథానాయిక నటిస్తుండగా రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ ఆమధ్య చిత్రం నుంచి 'లాహె..లాహె...' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. 
 
ప్రస్తుతం ఈ పాట చిరు అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట యూట్యాబ్‌లో 35 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది.
 
రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ గీతానికి హారిక నారాయణ్‌, సాహితి చాగంటి గొంతులు సవరించగా మణిశర్మ సంగీతం అందించారు. పాట ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు అందుకుంటోంది. 
 
ఈ చిత్రానికి నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాతలు. వాస్తవంగా ఈ చిత్రం మే13న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments