సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

దేవీ
శనివారం, 29 మార్చి 2025 (17:59 IST)
Dr. Anil Vishwanath
"28°C" రిలీజ్ ఆగిపోయినప్పుడు నా పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈ మూవీలో నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. సినిమా రిలీజ్ ఆగిపోయి నెక్ట్స్ ఏంటి అనే డైలమాలో ఉండేవాడిని. ఆత్మహత్య ఆలోచనలు కూడా కలిగేవి. అయితే బతికే సాధించాలనే పట్టుదలతో పొలిమేర స్క్రిప్ట్ చేసుకుని ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పొలిమేర 2 చేశాను. ఇప్పుడు పొలిమేర సిరీస్ లో థర్డ్ పార్ట్ చేస్తున్నాం. పొలిమేరతో వచ్చిన గుర్తింపుతో "28°C" సినిమా బాగా రిలీజ్ అవుతుందని నమ్ముతున్నా అని డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ అన్నారు.
 
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్.
 
- "28°C" సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇది మొదటి సినిమా. స్క్రిప్ట్ ను బాగా లవ్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాం.  క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. మార్చి లో లాక్ డౌన్ వచ్చింది. ఆ తర్వాత సినిమాల రిలీజ్ ల పరిస్థితి ఎలా మారిందో మీకు తెలుసు. ఓటీటీకి ఆఫర్స్ వచ్చాయి గానీ మేము సినిమాకు పెట్టిన ఖర్చుకు వారు ఆడిగిన రేట్ కు సంబంధం లేదు. అందుకే మూవీని ఓటీటీకి ఇవ్వలేదు. పైగా మా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలనే కోరిక ఉండేది. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. "28°C" సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం వల్ల మంచే జరిగిందని భావిస్తా
 
- ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ షేడ్స్ ఉంటాయి. మెడికల్ గా 28°C అనే అంశాన్ని కథలో మిక్స్ చేశాం. బ్రెయిన్ డ్యామేజీ అయిన వారు ఎక్కువ వేడి, చల్లదనం తట్టుకోలేరు. అది థియరీగా ఉంది. ఈ అంశాన్ని సినిమా కోసం ఎఫెక్టివ్ గా ఉపయోగించాం. టైటిల్ కనిపించే ప్రశ్నార్థకం మిమ్మల్ని సినిమా చివరి వరకు క్యూరియాసిటికి గురిచేస్తుంది.
 
- నా స్నేహితుడు వంశీ నందిపాటి "28°C" సినిమా చూసి ఇంతమంచి మూవీని రిలీజ్  చేయాలని ముందుకొచ్చాడు.  ఇప్పుడు మా లక్ష్యం ఈ సినిమాతో డబ్బులు సంపాదించడం కాదు మా ఫస్ట్ మూవీని థియేటర్స్ లో చూసుకోవడం. అందుకే వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ ఇప్పించమని వంశీని అడిగాను. "28°C" సినిమా చూసి నవీన్ చంద్ర ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
 
- "28°C" సినిమా రిలీజ్ కావడం ఆలస్యమైంది. అయితే అదృష్టవశాత్తూ ఇలాంటి కథతో మరే మూవీ థియేటర్స్ లో గానీ ఓటీటీలో గానీ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే చాలా బాధపడేవాడిని. నేను యూనిక్ బ్యాక్ డ్రాప్స్ తో కథలు రాస్తాను. అదే నాకు అడ్వాంటేజ్ అయ్యిందని భావిస్తా. సినిమాను క్రిస్ప్ గా 2 గంటలు ఉంటుంది. అనవసర సన్నివేశాలు తీసేసి టు ది పాయింట్ మూవీని తెరపై చూపించబోతున్నాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments