ప్రభాస్ కోరిక తీరేదెప్పుడు?

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:59 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాథేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.
 
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండా బాలీవుడ్ మూవీ ఆదిపురష్ ఎనౌన్స్ చేసారు. ఇలా... బాహుబలి తర్వాత ప్రభాస్ తన ఇమేజ్‌కి తగ్గట్టుగా వరుసగా భారీ యాక్షన్ చిత్రాలనే చేస్తున్నారు. అయితే.. ప్రభాస్ కోరిక మాత్రం వేరే ఉందట. అది ఏంటంటే.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నాడట. ఆయనకు కథలు చెప్పే డైరెక్టర్స్ మాత్రం భారీ యాక్షన్ స్టోరీసే చెబుతున్నారు.
 
ఇటీవల ప్రభాస్ తన మనసులో మాటను సన్నిహితుల దగ్గర బయటపెట్టాడట. ప్రభాస్ ఆలోచన తెలిసి ఎవరైనా ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసిన ఈ కథతో ప్రభాస్ సినిమా చేయడానికి చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే... ప్రభాస్ రాథేశ్యామ్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో చేస్తున్న సినిమా, ఆదిపురుష్.. ఈ మూడు సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఆతర్వాతే చేయాలి అంటే... చాలా టైమ్ పడుతుంది. మరి.. ప్రభాస్ కోరిక ఎప్పుడు తీరుతుందో..? ఎవరు తీరుస్తారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Octopus: డిజిటల్ మోసాలపై తెలంగాణ బ్రహ్మాస్త్రం.. ఆపరేషన్ ఆక్టోపస్ రెడీ

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. కారణం అదే..

భర్తను బ్రతికించుకునేందుకు భార్య రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్, విమానం కూలింది

వెంటిలేటర్‌పై పులివెందుల.. జగన్ రెండు రోజుల పర్యటన కలిసొస్తుందా?

మోహన్ బాబు యూనివర్శిటీకి చెందిన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, కారణం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

తర్వాతి కథనం
Show comments