Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో ఆఫర్లతో దూసుకెళ్తున్న అర్జున్ రెడ్డి లిప్ లాక్ లవర్స్

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ కొట్టేసిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా మారుతున్నాడు. ఈ క్రమంలో విలక్షణ నటుడు సాయికుమార్ కుమారుడు ఆది సాయి ఆఫర్‌ను కూడా విజయ్ దేవర కొండ

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (16:16 IST)
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ కొట్టేసిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా మారుతున్నాడు. ఈ క్రమంలో విలక్షణ నటుడు సాయికుమార్ కుమారుడు ఆది సాయి ఆఫర్‌ను కూడా విజయ్ దేవర కొండ కైవసం చేసుకున్నాడు.

ఇప్పటికే ఆదికి తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదు. దాంతో తండ్రి మాదిరిగానే కన్నడలో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. 
 
అయితే అది టాలీవుడ్‌కి రాంగ్ సిగ్నల్ అవుతుందని వెనక్కి తగ్గాడు. ఇంతలో ఆదికి జ్ఞానవేల్ రాజా సినిమా చేస్తానని మాటిచ్చాడట. స్టూడియో గ్రీన్ సంస్థకి గల పేరు గురించి తెలిసిన ఆది సాయికుమార్, అక్కడి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. కానీ తాజాగా ఆ సంస్థ ఆదిని పక్కనబెట్టి.. విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు రెడీ అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఆదికి నిరాశే మిగిలింది. ఇప్పటికే దేవ కట్టాతో కూడా అర్జున్ రెడ్డి ఓ సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. 
 
మరోవైపు అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో ఓవర్ ‌నైట్ స్టార్‌గా మారిన షాలినీ పాండే కూడా మంచి అవకాశాలను కైవసం చేసుకుంటుంది. కోలీవుడ్‌లో ఓ సినిమా కూడా విడుదల కాకుండానే వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. 
 
ఇప్పటికే ''100% లవ్'' తమిళ రీమేక్ '100% కాదల్' చిత్రంలో నటిస్తున్న షాలినికి, అక్కడ మరో ఆఫర్ వచ్చింది. జీవా హీరోగా తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది షాలిని. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డాన్ శాండీ దర్శకత్వంలో జీవా హీరోగా తెరకెక్కబోయే చిత్రంలో షాలిని హీరోయిన్‌గా నటిస్తుండగా, జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుందని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments