Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ ఆ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడా..?

Webdunia
సోమవారం, 11 మే 2020 (15:35 IST)
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ అనుకున్నారు. అయితే... ఫైటర్ అనే టైటిల్‌ని వేరే నిర్మాణ సంస్థ ఆల్రెడీ రిజిష్టర్ చేయించుకోవడంతో ఈ సినిమాకి లైగర్ అనే టైటిల్ ఖరారు చేయనున్నట్టు సమాచారం. 
 
ఈ మూవీని పూరి - ఛార్మి - కరణ్‌ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ మూవీ ముంబాయిలో నలభై రోజులు షూటింగ్ జరుపుకుంది.
 
ముంబాయిలో మరో షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఇంతలో కరోనా రావడంతో షూటింగ్స్ క్యాన్సిల్ అవ్వడం తెలిసిందే. ఈ సినిమా దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. తాజా వార్త ఏంటంటే.. వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుందని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో సినిమా చేయనున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత విభిన్న కథా చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయనున్నారని తెలిసింది.
 
ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని... అద్భుతం అనేలా ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తుండడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments