Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంకేం.. ఇంకేం.. కావాలే.. హ్యాపీ బర్త్ డే అర్జున్ రెడ్డి..

Advertiesment
Happy Birthday Vijay Devarakonda 2020
, శనివారం, 9 మే 2020 (09:34 IST)
విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్‌ను ఆకర్షించే యంగ్ హీరో పేరు. అప్పుడెప్పుడో రవిబాబు తెరకెక్కించిన నువ్విలా.. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి సినిమాల్లో ఉన్నాడా లేడా లాంటి పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ.. ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు. 
 
గత రెండేళ్లుగా ఫ్లాపుల్లో వుండొచ్చు కానీ.. విజయ్ నిజంగా సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్ అనే చెప్తున్నారు.. సినీ పండితులు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలో అదరగొట్టిన విజయ్ దేవర కొండకు మే 9న అంటే ఈ రోజు పుట్టిన రోజు. 30 ఏళ్లు పూర్తి చేసుకుని.. 31లోకి వెళ్తున్నాడు విజయ్ దేవరకొండ. 
 
నాలుగేళ్ల క్రితం విజయ్ ఎవరో ప్రేక్షకులకు తెలియదు. కానీ ప్రస్తుతం దక్షిణాది టాప్ సెలబ్రిటీస్‌లో ఒకడిగా మిగిలిపోయాడు. 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి పోర్ట్స్ లిస్టులో టాప్ 30లో చోటు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.
Vijay Devarakonda


తెలుగులోనే కాకుండా దేశం మొత్తం పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 
 
దక్షిణాదిన ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం విజయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 70 లక్షల మంది ఫాలో అవుతున్నారు. రెండేళ్ల కిందట 2018 మార్చి 7న విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించాడు. తక్కువ వ్యవధిలోనే 7 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించాడు. 
 
పెళ్లి చూపులు సినిమాలో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయిపోయాడు. గీత గోవిందం, టాక్సీ వాలా, మహానటి, సినిమాలతో సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. 
Vijay Devarakonda


డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో ఫైటర్.. శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలపైనే కోటి ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవర కొండ. ఈ సినిమాలు అతనికి బంపర్ హిట్ గుర్తింపును సంపాదించి పెట్టాలని ఆశిద్దాం.. ఇంకా విజయ్‌కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పేద్దాం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు చేసిన తప్పు ఇంకా నన్ను వేధిస్తోంది, పూజా హెగ్డే