లూసిఫర్ కోసం చిరంజీవి సోదరి ఫిక్స్! ఆగస్టు 22 నుంచి షూటింగ్

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (16:45 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం పేరు ఆచార్య. షుటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం.. కరోనా కారంగా అనుకున్న టైమ్‌కు షూటింగ్ పూర్తి చేసుకోలేక పోయింది. ఈ క్రమంలో చిరంజీవి తదుపరి ప్రాజెక్టులపై ఈ ప్రభావంపడింది.
 
ఈ నేపథ్యంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. కోలీవుడ్‌కు చెందిన మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్రకు అనేక మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. 
 
ఈ చిత్రంలో చెల్లి పాత్రకు అంత ప్రాధాన్యత వుంది. అందుకే రాధిక‌, ఖుష్బు, విజ‌యశాంతి, జెనీలియా ఇలా అనేక మంది పేర్లను పరిశీలించారు. కానీ, చివరకు బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ పేరు ఇపుడు తెరపైకి వచ్చింది. ఈ వార్తలు నిజమైతే.. చిరంజీవికి చెల్లిగా విద్యాబాలన్ లూసిఫర్ రీమేక్ చిత్రంలో నటించనుంది. 
 
కాగా, విద్యాబాలన్ చివరగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నటించారు. ఇందులో బాలకృష్ణ భార్యగా ఆమె నటించింది. అయితే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. 

మెగాస్టార్ పుట్టినరోజైన ఆగస్టు 22న లూసిఫర్‌ రీమేక్‌ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అన్నీ సాఫీగా సాగితే ఆగస్టు 22న లూసిఫర్‌ రీమేక్‌ టీజర్‌ విడుదల కావాల్సింది. 
 
కానీ, కరోనా ప్రభావం వల్ల ఆరోజున షూటింగ్‌ ప్రారంభించాల్సి వస్తోంది. ఎన్వీ ప్రసాద్‌ దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. చరణ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉండనున్నట్లు  తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments