Webdunia - Bharat's app for daily news and videos

Install App

లూసిఫర్ రీమేక్‌-చిరంజీవికి సోదరిగా విద్యాబాలన్..!

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (16:36 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్   రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక మెగాస్టార్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజాహెగ్డే  కనిపించనుంది.

ఈ సినిమా షూటింగు ఇంకా 20 రోజుల పాటు జరగవలసిన సమయంలో కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది. తాజాగా ‘కోకాపేట’లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 20 రోజుల పాటు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చిరంజీవి .. చరణ్ .. సోనూ సూద్ కాంబినేషన్లో సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట.
 
ఈ సినిమా తర్వాత మెగాస్టార్ లూసిఫర్ సినిమా రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్‌కు మోహన్ రాజా దర్శకత్వం చేయనున్నాడు. మెగాస్టార్ పుట్టినరోజైన ఆగస్టు 22న లూసిఫర్‌ రీమేక్‌ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఎన్వీ ప్రసాద్‌ దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. చరణ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉండనున్నట్లు  తెలుస్తుంది.
 
 మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ‘లూసిఫర్‌’ రీమేక్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించనున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ‘లూసిఫర్‌’ సినిమాలో చిరంజీవి సోదరి పాత్ర కీలకంగా ఉంటుందని, ఈ పాత్రలో నటించేందుకు విద్యాబాలన్ అంగీకరించారని సమాచారం. అయితే దీనిపై దర్శకుడు మోహన్‌రాజా ఇంకా స్పష్టతను ఇవ్వలేదు.

‘లూసిఫర్‌’ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సత్యదేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments