Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

దేవీ
మంగళవారం, 25 నవంబరు 2025 (11:48 IST)
Varanasi - Kamakya devei
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం వారణాసి. ఇటీవలే ఈ చిత్రం టైటిల్ తోపాటు గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యానించిన మాటలు తీవ్ర వివాదానికి దారితీశాయి. గ్లింప్స్ విడుదలలో మూడు సార్లు జాప్యం కావడంతో ఆయన సహనం కోల్పోయారు. దానితో దేవుడంటే నమ్మకం లేదంటూ ఆయన అనడం, హనుమంతుడు వెనుకవుండి నడిపిస్తాడని నాన్నగారు చెబుతుంటారు. అలాంటి హనుమంతుడు ఏం చేశాడు? అంటూ చూసే ప్రేక్షకులకు, వినే శ్రోతలకు ఊదం ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా పలువురు మేథావులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. వానరసేన అనే సంఘం కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజమౌళి మాటలు వ్యక్తిగం అనీ, అభిప్రాయాలు వెల్లడించే హక్కు అందరికీ వుందని రామ్ గోపాల్ వర్మతోపాటు పలువురు మేథావులు క్లారిటీ ఇచ్చారు. 
 
తాజాగా వేణు స్వామి దీనిపై ఓ వీడియో చేశారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యల గురించి తాను ప్రస్తావించడంలేదంటూ.. వారణాసి టైటిల్, గ్లింప్స్ గురించి వివరించారు. అందులో  కామాఖ్య దేవి కథ వుందని తేల్చి చెప్పారు. వీడియోలో ఒక్క డైలాగ్ లేకుండా క్రీ.పూ. క్రీ.శ. అంటూ మనం పిలుచుకునే విధానాన్ని ఆయన మరోరూపంలో తెలియజేస్తూ చేయడం విశేషం. అదేవిధంగా  కామాఖ్య దేవి రూపమైన చిన్న మస్తాన్ దేవిని చూపించిన విధానం నాకు నచ్చింది. వారణాసిలో అందో పాయింట్ అంటూ సరికొత్తగా విశ్లేషణ చేశాడు. అమ్మవారికి రాముడికి వున్న కథ లింక్ గురించి ఆయన కొద్దిగా మాట్లాడుతూ.. అమ్మవారిని టచ్ చేస్తేనే వివాదాలకు దారితీసేలా చేస్తుంది.
 
ఇంతకుముందు మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ కూడా ఆ అమ్మవారి నుంచి సంపాదించుకున్న శక్తుల్ని దుర్వినియోగం చేసే పాత్రలో నటించాడు. ఆ సినిమా షూటింగ్ లో వుండగా మనోజ్ ఇంటా, బయట వివాదాలలో కూరుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక బ్రహ్మాండంగా పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా వారణాసి సినిమా గురించి రాజమౌళి చెప్పినప్పుడు ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. ముందు ముందు సినిమా విడుదలయ్యాక ఊహించని విజయాన్ని ఆయన స్వంతం చేసుకుంటున్నారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments