Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

Advertiesment
SS Rajamouli

ఐవీఆర్

, ఆదివారం, 16 నవంబరు 2025 (16:20 IST)
దేవుడనేవాడున్నాడా అని మనిషికి సందేహం... ఉన్నావా అసలున్నావా వుంటే కళ్లు మూసుకున్నావా... ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడనేవాడు లేడంటూ చాలా పాటలు వున్నాయి. దేవుడిని నిందిస్తూ పరమభక్తులు చెప్పే మాటలు వున్నాయి. వాస్తవానికి వాళ్లంతా ఆ భగవంతుడిని పూర్తిగా విశ్వసించేవారే. ఇక అసలు విషయానికి వస్తే... ఆదివారం నాడు రామోజీ ఫిలిమ్ సిటీలో SSMB29 టైటిల్‌ను వారణాసి (Varanasi) అని నామకరణం చేసారు రాజమౌళి (SS Rajamouli).
 
ఐతే ఈ ఈవెంట్ సాగుతుండగా ఓ చిన్నపాటి సాంకేతిక కారణం వల్ల గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సుమారు అర్థగంట పాటు నిలిచిపోయింది. ఇలా అంతరాయం కలగక ముందు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... తనకు హనుమ ఇష్టదైవం అనీ, ఈ చిత్రాన్ని హనుమ వెనుక వుండి చేయించుకున్నాడనీ అన్నారు. అలా చెప్పిన కొద్దిసేపటికే ఇలా అంతరాయం కలగడంతో రాజమౌళి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. నాకు దేవుడు మీద నమ్మకం లేదండీ, నా తండ్రి ఇంతకుముందు చెప్పారు. హనుమ అన్నీ వెనుకే వుండి నడిపిస్తాడని, కానీ సాంకేతిక లోపం కారణంగా ఆగినప్పుడు దేవుడు ఇలాగేనా నడిపించేది అని కోపం వచ్చింది అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
రాజమౌళి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేవుడి పైన స్టోరీలు తీస్తారు, ఆ సెంటిమెంటుతోనే సినిమాను జనాలు చూస్తారు. అలా డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ తనకు దేవుడంటే నమ్మకం లేదని చెప్తాడు. ఆయనకు నమ్మకం లేకపోతే లేకపోవచ్చు కానీ అంతటి పెద్ద వేదిక మీద ఇలా చెప్పడం బాధాకరం అంటూ రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
 
వాస్తవానికి వారణాసి చిత్రం కంటే రాజమౌళి దేవుడంటే నమ్మకం లేదన్న కామెంట్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఏదేమైనప్పటికీ సహజంగా మనం అనుకున్నది అనుకున్నట్లు జరగక పోతే దేవుడు లేడని కొన్నిసార్లు అంటుంటారు చాలామంది. కనుక రాజమౌళి కూడా పెద్ద దర్శకుడు అయినప్పటికీ సామాన్య మానవుడే కదా. ఆయనకు ఉద్వేగం గట్రా వుంటాయి కనుక దేవుడు లేడు అని అనేసి వుంటారని భావించవచ్చనేది కొందరి వాదన. మరి మీరు ఏమంటారు..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్