Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న‌కు పోటీ ఇవ్వ‌నున్న‌ వైష్ణ‌వ్‌తేజ్! (video)

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:12 IST)
Vishav tej, Vijaseuptai
మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో నిర్మాత‌ల‌కు లాభాలు చేకూర్చాడు. న‌ట‌న అంటే ఏమీ తెలియ‌ద‌ని న‌టించి చూపాడు. ఈ సినిమా మేకింగ్ ఎన్నో స‌ల‌హాలు, సూచ‌న‌లు చిరంజీవి నుంచి తీసుకున్నాడు. అయితే ఎక్క‌డా చిరంజీవిని ఇమిటేట్ చేసేవిధంగా లేక‌పోవ‌డం ఆయ‌న‌కు ప్ల‌స్ అయింది. కానీ త‌న అన్న సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు అదే మైన‌స్ అయింది. సాయితేజ్ సినిమాల్లో చిరంజీవి రీమిక్స్ పాట‌లు వుండ‌డంతోపాటు ఆయ‌న్ను లాంగ్‌షాట్‌లో చూస్తుంటే చిరునే చూసిన‌ట్లు అనిపించేది. మేన‌ల్లుడు క‌నుక నా పోలిక‌లు రావ‌డం స‌హ‌జ‌మే అని చిరంజీవి మొద‌ట్లో స్టేట్ మెంట్ ఇచ్చాడు. 
 
ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసినా సాయితేజ్‌కు హిట్‌లు వున్నా న‌టుడిగా గుర్తిండిపోయే పాత్ర‌లేదు. కానీ ఉప్పెన సినిమా చూశాక సినీ విశ్లేష‌కులు, అభిమానులుకూడా వైష్ణ‌వ్‌తేజ్‌ను చూస్తుంటే అచ్చం సాయితేజ్‌ను చూస్తున్న‌ట్లే వుంద‌ని కామెంట్లు వ‌చ్చాయి. అదే అత‌నికి మైన‌స్ అనుకుంటే పొర‌పాటే. వైష్ణ‌వ్‌లో చురుకుద‌నం, ఆక‌ట్టుకునే క‌ళ్ళు వుండ‌డంతో అది బాగా ప్ల‌స్ అవుతుంద‌ని విశ్లేష‌కులు తెలియ‌జేస్తున్నారు. వారు అనుకున్న‌ట్లుగానే రిలీజ్‌కుముందు విజయ్‌సేతుప‌తి కూడా వైష్ణ‌వ్‌తేజ్ క‌ళ్ళ‌తోనే న‌టించ‌గ‌ల‌డ‌ని అమాయ‌క‌త్వం పాత్ర బాగా చేశాడ‌ని కితాబిచ్చాడు.

అందుకే ముందు ముందు సాయితేజ్‌కు వైష్ణ‌వ్‌తేజ్ పోటీ ఇవ్వ‌గ‌లడ‌ని తెలుస్తోంది. మొద‌టి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్ప‌టికే రెండు సినిమాకు రెడీ అయ్యాడు. సాయితేజ్‌కు మొద‌టి సినిమాకు ఇప్ప‌టి సినిమాకు బోడీలో మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అందుకే వైష్ణ‌వ్‌తేజ్‌కు బోడీని పెంచ‌కుండా చూసుకోవాల‌ని అత‌ని స‌న్నిహితులు స్నేహితులు కోరుతున్నార‌ని ఇటీవ‌లే ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం. 
 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments