Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీలో ప్రేమ వివాహాల ట్రెండ్.. రీతుతో వైష్ణవ్ ప్రేమలో వున్నారా?

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (20:16 IST)
vaishnav
మెగా ఫ్యామిలీలో ప్రేమ వివాహాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. మరో మెగా హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డాడు. అతను మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ ప్రేమలో పడ్డాడనే వార్త వైరల్ అవుతోంది.
 
వరుణ్ తేజ్ పెళ్లికి ముందు, మెగా, అల్లు కుటుంబాలు ఈ జంట కోసం ప్రీ-వెడ్డింగ్ పార్టీలను ఏర్పాటు చేశాయి. అయితే, అల్లు అర్జున్ పార్టీకి నటి రీతూ వర్మ హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పార్టీలో వైష్ణవ్ తేజ్ రీతూతో సన్నిహితంగా కనిపించాడు. దీంతో మెగా కాంపౌండ్‌లోని ఓ హీరోతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చర్చ మొదలైంది.
 
రీతూ వర్మ వైష్ణవ్ తేజ్‌తో ప్రేమలో ఉన్నారని చాలా మంది వ్యాఖ్యానించారు. త్వరలో ఆమె కూడా మెగా ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెట్టనుందని వార్తలు వైరల్ అవుతోంది. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ రకరకాల కామెంట్స్ రావడంతో ఈ రూమర్స్ పై స్పందించాడు. 
 
తన ఆదికేశవ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ విధంగా స్పందించాడు. తాను ఎవరినీ ప్రేమించనని, వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం మంచిదికాదన్నారు.
 
అంతే కాదు లావణ్య త్రిపాఠికి రీతూ మంచి స్నేహితురాలని, అందుకే పార్టీలోకి వచ్చిందని వైష్ణవ్ స్పష్టం చేశాడు. అంతకు మించి ఏమీ లేదని ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. 
 
అయితే గతంలో కూడా వైష్ణవ్ తేజ్‌కు సంబంధించిన ప్రేమకథలు వైరల్ అయ్యాయి. కృతి శెట్టితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని వైష్ణవ్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments