Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీలో రాములమ్ముకు కీలక పదవి.. చేరిన మరుసటి రోజే...

Advertiesment
vijayashanti
, శనివారం, 18 నవంబరు 2023 (12:10 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కీలక నేతలు చేరుతున్నారు. ఇలాంటివారిలో సినీ నటి విజయశాంతి ఒకరు. ఆమె శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన మరుసటి రోజే ఆమెకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార, ప్లానింగ్‌ కమిటీని కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటుచేసింది. కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలను తాజాగా పార్టీలో చేరిన విజయశాంతికి అప్పగించింది. 
 
కన్వీనర్లుగా సమరసింహా రెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండ రెడ్డి, నరేందర్‌ రెడ్డి, యరపతి అనిల్‌, రాములు నాయక్‌, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్‌, రమేష్‌, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్‌, రామ్మూర్తి నాయక్‌, అలీ బిన్‌ ఇబ్రహీం, దీపక్‌ జాన్‌ను నియమించింది. 
 
కింగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన బాలీవుడ్ నటి కంగనా  
 
పరుగుల కింగ్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రశంసల వర్షం కురిపించారు. స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో కోహ్లీ అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు (50) సాధించిన క్రికెటర్‌గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అలాగే, ఒకే ఎడిషన్‌ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాంటి క్రికెటర్ కోహ్లీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
"అద్భుతమైన వ్యక్తిత్వం, సెల్ఫ్ వర్త్ ఉన్న వ్యక్తి కోహ్లీ. భావితరాలు అతడు నడయాడిన భూమిని పూజించాలని వ్యాఖ్యానించింది. ఇందుకు అతడు పూర్తిగా అర్హుడని పేర్కొంది. సచిన్ రికార్డును అధికమించాక క్రికెట్ దేవుడుకి విరాట్ వందనం అర్పిస్తున్న దృశ్యాన్ని కూడా కంగనా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
అతకుముందు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా భర్తను పొగుడుతూ ఇన్‌స్టా స్టోరీని షేర్ చేసిన విషయం తెల్సిందే. మనసులోనూ ఆటపైనా నిజాయితీగా ఉండే విరాట్ నిజమైన దేవుడి బిడ్డ అంటూ కితాబుచ్చింది. అతడి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించిన భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని కూడా అనుష్క తన పోస్టులో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాట్‌జీపీటీ ఈసీవోకు ఉద్వాసన .. ఎందుకో తెలుసా?