స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు.. తొలి టీ20లో చతికిలబడింది. ఇటు బౌలింగ్‌తోపాటు అటు బ్యాటింగ్‌లోనూ తేలిపోవడంతో టీ20 సిరీస్‌ను హార్దిక్ సేన ఓటమితో మొదలెట్టింది. ఈ నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూచించాడు.
పొట్టి ఫార్మాట్‌లో పేసర్ ఉమ్రాన్ మాలిక్ తీవ్ర నిరాశ పరుస్తున్నాడని.. బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించడం లేదని జాఫర్ అన్నాడు. అతడు తన బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపించకపోతే ఈ ఫార్మాట్‌లో ఇబ్బందులకు గురవుతాడు.
తొలి మ్యాచ్‌లో కట్టర్లు మంచి ఎంపిక. కానీ అతడు అలా బౌలింగ్ చేయలేదు. రాంచి లాంటి పిచ్‌లపై పేసర్లు వైవిధ్యంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. స్థిరమైన వేగంతో బంతులు విసిరితే నష్టమే అని జాఫర్ పేర్కొన్నాడు.
రెండో టీ20లో ఉమ్రాన్ స్థానంలో జితేశ్ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని చెప్పాడు. 'ఉమ్రాన్ స్థానంలో జితేశ్‌ను తీసుకోవాలి. లేదంటే పృథ్వీషాను కూడా ఆలోచించొచ్చు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలంటే జితేశే ఉత్తమ ఎంపిక' అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు, న్యూజిలాండ్‌తో రెండో టీ20ని భారత్ ఆడనుంది.