Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

సెల్వి
గురువారం, 6 నవంబరు 2025 (11:29 IST)
Chinmayi-Sajjanar
సింగర్ చిన్మయిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ రీసెంట్‌గా తాళిపై చేసిన కామెంట్స్ వ్యవహారంలో ఈ దంపతులపై ట్రోలింగ్ సాగగా... ఆమె రియాక్ట్ అయ్యారు. తనపై వేధింపుల కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీ సజ్జనార్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై వి.సి. సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్ చేసి చర్య తీసుకోవాలని కోరారు. 
 
రీసెంట్‌గా నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తాళిపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తన భార్య తాళి మెడలో వేసుకోవాలా వద్దా అనేది ఆమె ఇష్టమేనని చేసిన కామెంట్లు విభిన్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొందరు నెటిజన్లు సపోర్ట్ చేయగా, మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. రాహుల్, చిన్మయి కపుల్‌ను ఏకి పారేశారు. దీనిపై రియాక్ట్ అయిన చిన్మయి ఘాటుగానే బదులిచ్చింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, కామెంట్స్ విపరీతంగా సాగడంతో ఈ వ్యవహారాన్ని సింగర్ చిన్మయి సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.
 
"దయచేసి దీన్ని చూడండి సార్. నేను ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. తెలంగాణలో మహిళలు మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. వారికి ఏదైనా అభిప్రాయం నచ్చకపోతే వదిలేసి వెళ్లిపోవచ్చు. ఈ పురుషులు ప్రాథమికంగా నా పిల్లలు చనిపోవాలని చెబుతున్నారు. నేను కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ కేసు 15 ఏళ్లు పట్టినా చట్టం తన పని తాను చేసుకోనివ్వండి." అంటూ రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలి.. ఆ విషయంలో ఈసీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్

Gold: రూ. 15 లక్షల విలువ చేసే బంగారం హారం ఆటోలో మర్చిపోయిన దంపతులు, ఏం జరిగింది?

చీమలంటే భయం చచ్చిపోతున్నా.. పాప జాగ్రత్త.. అన్నవరం, తిరుపతికి 1116, ఎల్లమ్మకు ఒడిబియ్యం

బార్బర్ షాపులో వ్యక్తికి మెడ తిప్పుతూ మసాజ్, పక్షవాతం వచ్చేస్తుందా? (video)

Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments