Webdunia - Bharat's app for daily news and videos

Install App

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

సెల్వి
గురువారం, 26 జూన్ 2025 (10:15 IST)
Trisha Mahesh Babu
ప్రముఖ నటి త్రిష, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పట్ల తనకున్న అభిమానాన్ని వెల్లడిస్తూ, ఆయన కళ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావాన్ని ప్రశంసించింది. అతను, సైనికుడు వంటి చిత్రాలలో మహేష్‌తో కలిసి పనిచేసిన త్రిష.. మహేష్ బాబును ప్రశంసలతో ముంచెత్తింది. 
 
ఇంకా త్రిష మాట్లాడుతూ.. "మహేష్ చెన్నైలో కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు మొదట కలిశాము. అప్పట్లో అది కేవలం "హాయ్-బై" రకమైన స్నేహం. మేము కలిసి సినిమాల్లో పని చేస్తామని ఊహించలేదు. అలాగే షూటింగ్ సెట్‌లో మహేష్ చాలా కష్టపడి పనిచేసేవాడు. అతను తెల్లవారుజాము నుండి రాత్రి 10 గంటల వరకు సెట్‌లో ఉంటాడు. అతని అంకితభావాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా బాధగా అనిపించింది. అతను తన కారవాన్‌కి కూడా వెళ్ళడు. మానిటర్ ముందు కూర్చుని, ప్రతి సన్నివేశాన్ని శ్రద్ధగా చూసేవాడు. అది నన్ను, హాస్యనటులను లేదా ఇతర సిబ్బందిని ఆశ్చర్యపరిచింది." అంటూ చెప్పుకొచ్చింది.
 
ఇంకా అతడు సినిమాలో మహేష్ బాబుతో త్రిష కెమిస్ట్రీపై మాట్లాడుతూ.. ఈ సినిమా ఎప్పటికీ అభిమానుల ఫేవరేట్ అంటూ చెప్పింది. అయితే సైనికుడు యాక్షన్-ఆధారిత కథనంలో మహేష్ రాణించాడని త్రిష వెల్లడించింది. కాగా.. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్ర తెలుగు తారలతో స్క్రీన్ షేర్ చేసుకున్న త్రిష, టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 
 
ప్రస్తుతం, త్రిష రెండు ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది. ఇందులో మెగా స్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర వుంది. అలాగే కోలీవుడ్‌లో సూర్యతో రాబోయే చిత్రం కరుప్పులో కనిపిస్తోంది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. దశాబ్దాల కెరీర్‌తో, త్రిష దక్షిణ భారత సినిమాలో అత్యంత గౌరవనీయమైన, అభిమానులతో ఆరాధించబడిన నటీమణులలో ఒకరిగా మిగిలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments