Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష అనుకుంటే.. కాజల్ కూడా షాక్ ఇచ్చింది, పాపం ఆచార్య

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (21:11 IST)
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. ఇటీవల ఆచార్య షూటింగ్‌లో త్రిష జాయిన్ అయినట్టు టాక్ వచ్చింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. త్రిష ఆచార్య సినిమా నుంచి తప్పుకుంది. అవును.. ఈ విషయాన్ని స్వయంగా త్రిష ట్విట్టర్ ద్వారా తెలియచేయడం విశేషం. 
 
ఒక సినిమా నుంచి హీరోయిన్ తప్పుకోవడం అనేది కామన్ కావచ్చు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి త్రిష తప్పుకుంది అంటే.. ఏదో బలమైన కారణం ఉండొచ్చు.
 
 చిరంజీవి, త్రిషపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించాలి అనుకుంటున్న టైమ్‌లో ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను అని ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. త్రిష ఇలా చిరు సినిమా నుంచి లాస్ట్ మినిట్‌లో తప్పుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. 
 
అయితే.. త్రిష ఇచ్చిన షాక్‌తో వెంటనే తేరుకుని చిరు సరసన ఎవరైతే బాగుంటారని ఆలోచించి ఆఖరికి కాజల్‌ని కాంటాక్ట్ చేసారని తెలిసింది. 
 
ఇదిలా ఉంటే... కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తూ షాక్ ఇచ్చిందట. ఇటీవల కాలంలో కాజల్ నటించిన సీత, రణరంగం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో కాజల్‌కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. 
 
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారతీయుడు 2 సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇలాంటి టైమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం వస్తే.. ఎవరైనా వెంటనే ఓకే చెబుతారు కానీ.. కాజల్ అలా కాకుండా తనకు రెమ్యూనరేషన్ ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో చిరు, కొరటాల షాక్ అయ్యారని టాక్. 
 
కాజల్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి.. ఆమెనే ఫైనల్ చేస్తారో.. లేక వేరే హీరోయిన్‌ని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments