Webdunia - Bharat's app for daily news and videos

Install App

'షటప్ యువర్ మౌత్' అని శ్రీదేవి తన కుమార్తె జాన్విని కసిరిందా? ఎందుకు?

లాక్మే ఫ్యాషన్ వీక్ 2018లో సీనియర్ నటి శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వి కపూర్ అలా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తూ కనిపించారు. ఇద్దరూ తొలుత ఎంతో సరదాగా ఆకట్టుకునే దుస్తుల్లో కనిపించి కెమేరాల ముందు నిలుచుకున్నారు. ఆ తర్వాత జాహ్నవి ప్రక్కనే నిలబడింది. కొద్దిసేపు

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (19:06 IST)
లాక్మే ఫ్యాషన్ వీక్ 2018లో సీనియర్ నటి శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వి కపూర్ అలా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తూ కనిపించారు. ఇద్దరూ తొలుత ఎంతో సరదాగా ఆకట్టుకునే దుస్తుల్లో కనిపించి కెమేరాల ముందు నిలుచుకున్నారు. ఆ తర్వాత జాహ్నవి ప్రక్కనే నిలబడింది. కొద్దిసేపు శ్రీదేవి కేమేరాలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి వెళుతున్న సమయంలో జాన్వి వైపు చూస్తూ కోపంగా కసురుతూ మాట్లాడినట్లు కనిపించింది. 
 
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. జాన్వి వేసుకున్న వస్త్రధారణ సరిగా లేకపోవడంతో శ్రీదేవి కసిరిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరికొందరు... కెమేరాలకు ఫోజులిచ్చేందుకు జాన్వి అడిగితే.. ఫోటోల్లేవు గిటోల్లేవు ఇంటికి పద అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ మరికొందరు చెప్పుకుంటున్నారు.
 
ఇకపోతే జాన్వి మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో నటించనుంది. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అగ్రకులానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మధ్య కలిగిన ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతామని కరణ్ జోహార్ అన్నారు. జీ స్టూడియోస్, ధర్మా మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments