Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడపిల్లలు ఎక్కువగా తండ్రిని ఎందుకు ప్రేమిస్తారో తెలుసా...?

ప్రతి తండ్రికి తన కూతురే బంగారం. కొన్నికొన్నిసార్లు తన భార్య మీద చూపే ప్రేమకంటే కూతురిపైన ఎనలేని ప్రేమను పంచడం నాన్నకే సాధ్యమౌతుంది. ఒక మగవారికి మాత్రమే లభించిన ఒక పెద్ద వరం. తన జీవితంలో ముగ్గురు అమ్మలను పొందడమే జన్మను ఇచ్చిన తల్లి.. తన రక్తం పంచుకున

Advertiesment
ఆడపిల్లలు ఎక్కువగా తండ్రిని ఎందుకు ప్రేమిస్తారో తెలుసా...?
, సోమవారం, 22 జనవరి 2018 (15:18 IST)
ప్రతి తండ్రికి తన కూతురే బంగారం. కొన్నికొన్నిసార్లు తన భార్య మీద చూపే ప్రేమకంటే కూతురిపైన ఎనలేని ప్రేమను పంచడం నాన్నకే సాధ్యమౌతుంది. ఒక మగవారికి మాత్రమే లభించిన ఒక పెద్ద వరం. తన జీవితంలో ముగ్గురు అమ్మలను పొందడమే జన్మను ఇచ్చిన తల్లి.. తన రక్తం పంచుకుని పుట్టిన సోదరి (రెండో తల్లి) తనకు పుట్టిన తన కూతురు (మూడో తల్లి). ప్రతి కూతురికి తండ్రే నిజమైన స్నేహితుడు. నమ్మకమైన ఆత్మీయుడు ఆపద సమయంలో తోడుంటే బంధం. 
 
తండ్రి తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఖర్చు పెట్టేది తన కూతురికోసమే. ఎలాంటి  పరిస్థితిలోనూ తన తండ్రే కూతురికి రక్షణ. రక్షణ విషయంలో అమ్మ కంటే నాన్ననే జాగ్రత్తలు తీసుకుంటారు. అబ్బాయిల మీద చూపే కోపం కంటే తన కూతురిమీద చూపే కోపం చాలా తక్కువ అని చెప్పాలి. కొడుకును పలుమార్లు దండించి ఉండవచ్చు కానీ కూతురిపై ఒక దెబ్బ కూడా వేయని తల్లిదండ్రులు ఉన్నారు.
 
కూతురు ఏదైనా అడిగితే లేదని చెప్పలేని ఒకే ఒక ప్రాణి నాన్నే. బయటకు వెళ్ళినప్పుడు ఆలస్యం అయితే ఎంత సమయం అయినా సరే తనకోసం వేచి ఉండేది తండ్రే. వయస్సుకు వచ్చాక ప్రేమ అంటే ఏంటో ఆకర్షణ అంటే ఏమిటో నిదానంగా వివరించి చెప్పేది ఒక నాన్ననే. 
 
కూతురు ఏ క్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నా సరే ఆ కష్టం నుంచి తనని బయటకు తీసుకుని వచ్చేది కూడా నాన్నే. తల్లి గోరుముద్దలు పెట్టి ఎంత ప్రాణంగా చూసుకున్నా కూతురికి ధైర్యాన్ని నూరిపోసేది నాన్నే. నాన్నకు తన బిడ్డ జీవితంపై కాస్త ఎక్కువగానే భయం ఉంటుంది. అది భయం కాదు తనపై ఉండే అక్కర. ఒక అమ్మాయి జీవితంలో తండ్రి అనేవారు ఓ నేస్తం. దారి చూపే దేవుడు..ఏం చేసినా మన్నించి గుండెలో దాచుకునే ఓ కాపలాదారుడు. ఓ హీరో..ఓ హితుడు..ఇంతటి గొప్ప తండ్రిని ఏ కూతురైనా ఎక్కువగా ప్రేమించడంలో ఆశ్చర్యం ఏముంటుంది..చెప్పండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?