శ్రీదేవిపై ''భాగమతి'' పోటీ: ఇంగ్లిష్ వింగ్లిష్ రికార్డుకు చేరువలో..?
బాహుబలి దేవసేన, అనుష్క ప్రధాన పాత్రగా నటించిన ''భాగమతి'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 28.5 కోట్ల గ్రాస్‌ను, రూ.17.95కోట్ల షేర్‌ను సాధించింది. ఇక
బాహుబలి దేవసేన, అనుష్క ప్రధాన పాత్రగా నటించిన ''భాగమతి'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 28.5 కోట్ల గ్రాస్‌ను, రూ.17.95కోట్ల షేర్‌ను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ.58.9కోట్ల గ్రాస్, రూ.30.9 కోట్ల షేర్‌ను రాబట్టింది.
ఇక ముఖ్యంగా అమెరికాలో స్టార్ హీరోల స్థాయిలో ''భాగమతి'' 1 మిలియన్ మార్కును అధిగమించింది. తద్వారా గతంలో శ్రీదేవి నటించిన ''ఇంగ్లిష్ వింగ్లిష్'' సినిమా రికార్డును అధిగమించే దిశగా భాగమతి దూసుకెళ్తోంది. తద్వారా ''భాగమతి'' హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో అధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ సినిమా నిలిచింది.
ఇకపోతే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా అమెరికాలో 1.85 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అలాగే హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన చిత్రాల వసూళ్లలో కొత్త రికార్డును సృష్టించింది. ఈ రికార్డును భాగమతి బ్రేక్ చేస్తుందా? లేదా? అనేది ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.