Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019 జనవరిలో ''సాహో'' విడుదల: స్వీటీ గెస్ట్ రోల్?

2019 జనవరిలోనే ''సాహో'' సినిమా విడుదల కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న టీమ్ దుబాయ్‌కి బయల్దేరనుంది. ఇందుకోసం ఫిబ్రవరిలో దుబాయ్‌కి సాహో టీమ్

Advertiesment
2019 జనవరిలో ''సాహో'' విడుదల: స్వీటీ గెస్ట్ రోల్?
, గురువారం, 25 జనవరి 2018 (17:50 IST)
2019 జనవరిలోనే ''సాహో'' సినిమా విడుదల కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న టీమ్ దుబాయ్‌కి బయల్దేరనుంది. ఇందుకోసం ఫిబ్రవరిలో దుబాయ్‌కి సాహో టీమ్ ప్రయాణం కానుంది. 
 
దుబాయ్‌లో రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. దుబాయ్ షెడ్యూల్‌తో ఈ సినిమా 50 శాతం మేర షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుందని తెలిసింది. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. ప్రభాస్‌, అనుష్క‌ వెండితెరపై హిట్ పెయిర్. అంత‌కంటే అవుట్ ఆఫ్ స్క్రీన్‌లో మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఈ సాహో చిత్రంలో అనుష్క ఓ గెస్ట్ రోల్‌లో క‌నిపించే ఛాన్సుందని సమాచారం. ప్ర‌భాస్ కోస‌మే ఈ అతిథి పాత్ర‌ని స్వీటీ ఒప్పుకుంద‌ని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణిసేన వైట్ హౌస్ ముందు ధ‌ర్నా చేస్తుందా? స్కూల్ బస్సుపై దాడి చేయలేదట