Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

వర్మను విమర్శించడం ఎందుకు.. ప్రభాస్ పెళ్లి గురించి?: కృష్ణంరాజు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పోర్న్ స్టార్‌తో ఓ లఘు చిత్రాన్ని తీస్తున్నాడు. వర్మ మాత్రం ఇందుకు కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఇదొక సినిమా కాదని, షార్ట్ ఫిలిమ్ కూడా కాదని.. వెబ్ సిరీస్ కూడా క

Advertiesment
Krishnam Raju
, శనివారం, 20 జనవరి 2018 (13:21 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పోర్న్ స్టార్‌తో ఓ లఘు చిత్రాన్ని తీస్తున్నాడు. వర్మ మాత్రం ఇందుకు కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఇదొక సినిమా కాదని, షార్ట్ ఫిలిమ్ కూడా కాదని.. వెబ్ సిరీస్ కూడా కానే కాదని.. ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వాగతమని చెప్పాడు. ఈ సినిమా పేరు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఈ ట్రైలర్ ఇప్పటికే విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది.
 
అయితే ఈ సినిమాపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. వర్మ పోర్న్ సినిమాలు తీసి యువతను పెడదారి పెడుతున్నాడని వ్యతిరేకత వచ్చింది. 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే సినిమా రిపబ్లిక్ డే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై సీనియర్ నటుడు కృష్ణంరాజు స్పందించారు. సినిమాను వర్మ ఏ ఉద్దేశంతో తెరకెక్కించాడనే విషయాన్ని చూడాలన్నారు. తన సినిమా చూడాలని వర్మ ఎవ్వరినీ బలవంత పెట్టలేదు. 
 
ఇంటర్నెట్ పుణ్యంతో ప్రతి ఒక్క అంశం అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజుల్లో పిల్లలకు తెలియకుండా ఏ విషయాన్ని దాచడం కుదిరే పనికాదన్నారు. మనలో చాలామంది అలాంటి సినిమాలు చూస్తున్నారనే విషయాన్ని కృష్ణంరాజు గుర్తు చేశారు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మను విమర్శించాల్సిన అవసరం లేదని, వర్మను జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు దర్శకుడిగా చూడాలన్నారు. 
 
ఇంకా ప్రభాస్ పెళ్లి గురించి కూడా కృష్ణంరాజు స్పందించారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నామని.. త్వరలో ప్రకటన చేస్తామన్నారు. జనవరి 20న పుట్టిన రోజు జరుపుకుంటున్న కృష్ణంరాజు ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై చర్చించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ ఫ్యాన్స్‌తో కత్తి మహేష్ సెల్పీలు... స్వీట్లు కూడా తినిపించుకున్నారు