Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలెక్కనున్న తమన్నా.. వరుడు ఎవరో తెలుసా?

బాహుబలి సినిమా తర్వాత అందాలను ఎంత ఆరబోసినా.. తెల్లపిల్ల తమన్నా మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావట్లేదు. దీంతో సినిమాల ఎంపికలో లేటు చేస్తున్న తమన్నా.. ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ఇప్పటిక

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (17:57 IST)
బాహుబలి సినిమా తర్వాత అందాలను ఎంత ఆరబోసినా.. తెల్లపిల్ల తమన్నా మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావట్లేదు. దీంతో సినిమాల ఎంపికలో లేటు చేస్తున్న తమన్నా.. ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడుపదుల వయసు దాటిన హీరోయిన్లు పెళ్లి బాట పట్టారు. సంపాదనతో పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 
 
ఇందులో భాగంగా మొన్నటికి మొన్న శ్రియ పెళ్లి చేసుకుని.. మళ్లీ సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పెళ్లి పీటలెక్కనుంది. ఒకవైపు నటన.. మరోవైపు వ్యాపారం అంటూ బిజీబిజీగా వున్న తమన్నా.. ఇక లైఫ్‌లోనూ సెటిల్ అవ్వాలనుకుంటోంది. 
 
ఇప్పటికే తమన్నా కోసం వరుడు కూడా రెడీగా ఉన్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అతడు డాక్టర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. పెళ్లికొడుకు ఫ్యామిలీ అమెరికాలో బాగా సిర్థరపడిన కుటుంబమని సమాచారం. 
 
అక్కడ వారికి చాలా వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ఇరువైపులా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చితార్ధానికి ముహూర్తాలు చూస్తున్నారని టాక్. పెళ్ళి తరువాత తమన్నా అమెరికా వెళ్ళిపోతుందని, పెళ్లి కోసమే తమన్నా పెద్దగా సినిమా ఆఫర్లను ఒప్పుకోవట్లేదని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments