Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికాగో సెక్స్ దందా.. కిషన్, చంద్రకళ దోషులే.. అమెరికా కోర్టు

చికాగో సెక్స్ రాకెట్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిషన్ మోదుగుపుడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళను అరెస్ట్ చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రొడక్ష

Advertiesment
చికాగో సెక్స్ దందా.. కిషన్, చంద్రకళ దోషులే.. అమెరికా కోర్టు
, శనివారం, 14 జులై 2018 (15:26 IST)
చికాగో సెక్స్ రాకెట్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిషన్ మోదుగుపుడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళను అరెస్ట్ చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. 
 
ఏడాది కాలంలో వీరు వర్ధమాన తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారని విచారణలో తెలిసింది. ఈ కేసులో నిందితులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలను అమెరికా కోర్టు దోషులుగా తేల్చింది. ఈనెల 18న వీరికి శిక్షను ఖరారు చేయనుంది. 
 
గరిష్టంగా పదేళ్ల వరకు వీరికి శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈవెంట్ల పేరుతో టాలీవుడ్ హీరోయిన్లను అమెరికాకు పిలిపించి, వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు ప్రకటించింది. ఈ సెక్స్ దందా కోసం వీసా పర్మిట్‌లను దుర్వినియోగం చేశారని చెప్పింది. అనైతిక కార్యకలాపాల కోసం మహిళలను అక్రమంగా రవాణా చేశారని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో... ఆ 'పందెం కోడి' నన్నేమైనా చేసేస్తాడేమో? హల్లో 'Allu Bobby' అంటూ శ్రీరెడ్డి పోస్ట్(Video)